ANNAMAIAH CD RELEASED_ ”అన్నమయ్య సంకీర్తన వైభోగం” సంకీర్తనల ఆవిష్కరణ

Tirupati, 18 January 2018: The SV Recording Project of TTD has come with the release of yet another audio CD “Annamayya Sankeerthana Vaibhogam” in the mellifluous voice of Sri G.Bala Krishna Prasad.

The CD launch took place at Annamacharya Kalamandiram on Thursday evening.

Later Sri Balakrishna Prasad presented some of the songs and enthralled the music lovers.

SV Recording Project Special Officer Sri Munirathnam Reddy was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

”అన్నమయ్య సంకీర్తన వైభోగం” సంకీర్తనల ఆవిష్కరణ

తిరుపతి, 2018 జనవరి 18: శ్రీవారు జన్మించిన శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని గురువారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య సంకీర్తన వైభోగం” సంకీర్తనలను ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.

టిటిడి ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు. ఇందులోని సంకీర్తనలను టిటిడి ఆస్థాన సంగీత విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ స్వరపరిచి గానం చేశారు. ఈ సందర్భంగా శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌ను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం ఆయన ఈ సంకీర్తనలను పాడి వినిపించారు.

ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.