SRI KALYANA VENKATESWARA RIDES GOLDEN CHARIOT_ స్వర్ణరథంపై కాంతులీనిన కల్యాణ వెంకన్న

Tirupati, 05 March 2024: As part of the annual Brahmotsavam at Srinivasa Mangapuram Sri Kalyana Venkateswara Swamy temple, the Golden Chariot procession was held on Tuesday evening between 4 pm and 5 pm.

Sridevi Bhudevi sameta Sri Kalyana Venkateswara Swamy ascended the shining golden chariot and blessed the devotees.  

Special Grade Deputy EO of the temple Smt. Varalakshmi, VGO Sri Bali Reddy AEO Sri. Gopinath, Superintendents Sri. Venkata Swamy, Sri. Chengalrayulu, Temple Inspector Sri. Kiran Kumar Reddy participated in this program.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

స్వర్ణరథంపై కాంతులీనిన కల్యాణ శ్రీనివాసుడు
 
తిరుపతి, 2024 మార్చి 05: శ్రీ‌నివాసమంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు స్వర్ణరథోత్సవం కన్నులపండుగగా జరిగింది. 
 
శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ధగధగ మెరిసిపోతున్న స్వర్ణరథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహించారు . వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు  చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
 
స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో బంగారు, మణులు, సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం 
 
ఈ కార్యక్రమంలో  ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, విజివో శ్రీ బాలి రెడ్డి  ఏఈవో  శ్రీ గోపీనాథ్,  సూప‌రింటెండెంట్లు శ్రీ వెంకట స్వామి, శ్రీ చెంగ‌ల్రాయులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.  
 
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.