INAUGURATION OF SARANGAPANI PROJECT ON MARCH 7 _ మార్చి 7న శ్వేతలో సారంగపాణి ప్రాజెక్టు ప్రారంభోత్సవం

Tirupati, 05 March 2024: TTD will launch a project dedicated to Sri Sarangapani, a famous 17th-century poet and composer of Carnatic music who lived in the Karvetinagaram area of ​​Chittoor district. 

Sri Sarangapani penned about 5 thousand kirtans in Telugu and Sanskrit in praise of Sri Venugopala Swamy. 

The inauguration of the project will be held on Thursday, March 7 at 3 pm at the SVETA Building in Tirupati.

Padma Bhushan awardee and renowned playback singer Dr.  P. Susheela, TTD Chairman Sri. Bhumana Karunakara Reddy, EO Sri. AV. Dharma Reddy, JEO Sri. Veerabraham, SVBC Chairman Dr. Saikrishna Yachendra will grace the event.

Arrangements are being made for this under the aegis of SVETA Director Sri Bhumana Subrahmanyam Reddy.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

మార్చి 7న శ్వేతలో సారంగపాణి ప్రాజెక్టు ప్రారంభోత్సవం

మార్చి 05, తిరుపతి, 2024: చిత్తూరు జిల్లా కార్వేటినగరం ప్రాంతంలో నివసించిన 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవి, కర్ణాటక సంగీత స్వరకర్త శ్రీ సారంగపాణి పేరిట టీటీడీ ఒక ప్రాజెక్టును ప్రారంభించనుంది. శ్రీ వేణుగోపాల స్వామివారిని కీర్తిస్తూ శ్రీసారంగపాణి తెలుగు, సంస్కృత భాషల్లో సుమారు 5 వేల కీర్తనలు రచించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం మార్చి 7వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలోని శ్వేత భవనంలో జరగనుంది.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ సంగీత కళాకారిణి డా. పి.సుశీల, ముఖ్య అతిథిగా టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి, ప్రత్యేక అతిథులుగా ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, గౌరవ అతిథిగా ఎస్వీబీసీ ఛైర్మన్ శ్రీ సాయికృష్ణ యాచేంద్ర విచ్చేయనున్నారు.

శ్వేత సంచాలకులు శ్రీ భూమనసుబ్రహ్మణ్యంరెడ్డి ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.