SRI KALYANA VENKATESWARA SWAMY TEMPLE- TEMPLE, WHICH PROMOTED WEDDINGS_ బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం శ్రీ కల్యాణ వెంకన్న దర్శనం…కల్యాణ ప్రదం
Srinivasa Mangapuram, 26 Feb. 19: it is always a wedding bell in this temple – Sri Kalyana Venkateswara temple in this town.
The mythological location on the outskirts of Tirupati known as honeymoon spot of Lord Venkateswara and his consort Goddess Padmavati is also known for promoting marriages in a big way. Legend says the Lord Venkateswara and Padmavati spent six months in the Ashram of Agasthyeswara after their wedding at Tiruchanoor. They spent six months in the forest abutting the swarnamukhi- Kalyanai-Bhima sangamam before leaving for Tirumala.
The Kalyana Kankanam offered to devotees after the daily Kalyanotsavam in the temple is said to not only ensure early marriages among the unwed and but also bring happiness among the newly wedded.
Sri Balaji Rangacharyulu, chief priest of – Sri Kalyana Venkateswara temple says that the holy Kalyana Kankanam that is tied during the daily Kalanotsavam is, offered to the devotees.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
బ్రహ్మోత్సవాల ప్రత్యేక వ్యాసం శ్రీ కల్యాణ వెంకన్న దర్శనం…కల్యాణ ప్రదం
తిరుపతి, 2019 ఫిబ్రవరి 26: కల్యాణం అంటే వివాహం మొకటే కాదు, సంతానం, సౌభాగ్యం, గృహవసతి, ఆరోగ్యం, ఐశ్వర్యం అని ఇలా ఎన్నో అర్థాలున్నాయి. ఇలా కోరిన కోరికలన్నింటినీ భక్తులకు అనుగ్రహిస్తానని ఇక్కడి స్వామి వరమిచ్చాడు. కాబట్టే, స్వామికి కల్యాణ వేంకటేశ్వరస్వామి అనే పేరు సార్థకమైంది.
సువర్ణముఖీ-కల్యాణీ-భీమా నదుల త్రివేణీ సంగమ పవిత్ర జలాలు ప్రవహించిన పుణ్యభూములకు ఆల వాలం ఈ ప్రాంతం. అగస్త ్యమహర్షి వంటి తపోమూర్తుల ఆశ్రమవాటికలకు నిలయం ఈ ప్రాంతం. నూతన వధూవరులైన పద్మావతీ శ్రీనివాసు లిద్దరూ ఇక్కడ విహరించడంవల్ల పావనమైన కల్యాణపురం శ్రీనివాస మంగాపురప్రాంతం. వేదపురుషుడైన వేంకటేశ్వరునికి నాలుగువేదాలను వినిపించిన ఘనాపాఠుల అగ్రహారాలకు నిలయం ఈ ప్రాంతం. స్వామి ఆరగించే దివ్యాన్నాలకోసం, ఇక్కడ మాగాణిభూముల్లో సన్నని రాజభోగాల వడ్లను పండించే రైతన్నలకు నిలయం ఈ ప్రాంతం. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ప్రాంతం మధ్యలో కేంద్రబిందువై కల్యాణ పరంపరల్ని గుప్పిస్తూన్న ఆలయమే శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరుని దేవాలయం.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ప్రతినిత్యం జరుగుతున్న కల్యాణోత్సవంలో పాల్గొని, స్వామికి దరింపచేసిన కల్యాణ కంకణాలు దరిస్తే ఆరు మాసాలలోపు కల్యాణం అయ్యెలా స్వామివారు వరం ఇచ్చినట్లు ఆలయ ప్రధాన అర్చకులు, కంకణబట్టార్ శ్రీ బాలాజి రంగాచార్యులు తెలిపారు. అంతేగాక స్వామివారి కల్యాణం జరిపించిన దంపతులు, అవివాహితులు స్వామికి కట్టిన రక్ష బంధనాన్ని ధరించి స్వామి అనుగ్రహన్ని పొందుతున్నారన్నారు.
స్వామికి ఎంతో ఇష్టమైన ప్రదేశం –
శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారు అగస్త్యేశ్వరక్షేత్రానికి కొత్త పెండ్లికొడుకైన శ్రీనివాసుడు తన దేవేరి పద్మావతితో తిరుమలకు వెళ్తూ ఇక్కడికి వచ్చాడు. అక్కడున్న అగస్త్య మహాముని పసుపుబట్టలతో ఉన్న ఆ నూతన వధూవరు లను ఆశీర్వదించి, వారు ఆ వస్త్రాలతో కొండెక్కడం నిషేధమని, ఆరుమాసాలదాకా ఇక్కడే ఉండండని ఆత్మీయంగా చెప్పాడు. ఇక చేసేదేమీలేక శ్రీనివాసుడు అంగీకరించాడు.
మనోజ్ఞమైన వాతావరణానికి శ్రీనివాసమంగాపురం పెట్టింది పేరు. ఇక్కణ్ణుంచి శ్రీవారిమెట్టుమార్గంగుండా తిరుమల చేరడానికి దగ్గరిదోవ. శేషాచలకొండల అంద చందాలను చూస్తూ ఆరుమాసాలు గడిపిన స్వామి అగస్త్య మహాముని అనుమతి తీసుకొని భార్యాసమేతంగా శ్రీవారి మెట్టుమార్గంగుండా తిరుమల చేరినాడు. అలా శ్రీవారి మెట్లు, అమ్మవారి కాలిమెట్లు రెండూ సోకిన ఈ కాలిమార్గం ఎంతో పవిత్రమైంది. తదనంతరకాలంలో చంద్రగిరి రాజ్యాన్ని ఏలిన రాజులెందరో చంద్రగిరి కోటనుంచి శ్రీవారి ఆలయంవరకు ఏర్పడిన సరళమార్గాన్నను సరించి స్వామి దర్శనం చేసుకొని పునీతులై నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.