PARAMESA RIDES ON SURYA PRABHA_ సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామివారి అభయం

Tirupati, 26 Feb. 19: On the second day morning as a part of the ongoing annual brahmotsavams in Kapileswara Swamy temple, Lord Shiva took a celestial ride on the Surya Prabha Vahanam.

The bright sunny day on Tuesday witnessed the grandeur of Lord taking the ride along the mada streets on the finely decked Surya Prabha carrier.

Lord Shiva wears both Surya and Chandra as his head gears and His eyes are often described as ”Surya Sashanka Vahni Nayan” in Hindu mythology.

Temple DyEO Sri Subramanyam, VGO Sri Ashok Kumar Goud, AEO Sri Nagaraj, Suptd Sri Rajkumar, Archakas and devotees took part.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

సూర్యప్రభ వాహనంపై శ్రీకపిలేశ్వరస్వామివారి అభయం

ఫిబ్రవరి 26, తిరుపతి, 2019: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7 నుండి 9 గంటల వరకు వాహనసేవ సాగింది. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్‌, అన్నారావు సర్కిల్‌, వినాయక నగర్‌ ఎల్‌ టైప్‌ క్వార్టర్స్‌, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్‌ రోడ్‌ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి.

చీకటిని ఛేదించి లోకానికి వెలుగు ప్రసాదించేవాడు సూర్యుడు. సూర్యుని ప్రభ లోకబంధువైన కోటిసూర్యప్రభామూర్తి శివదేవునికి వాహనమైంది. మయామోహాందకారాన్ని తొలగించే సోమస్కందమూర్తి, భక్తులకు సంసారతాపాన్ని తొలగిస్తున్నాడు.

అనంతరం ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం ఘనంగా జరిగింది. శ్రీ స్కోమస్కందమూర్తి, శ్రీకామాక్షి దేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు.

చంద్రప్రభ వాహనం

రాత్రి 7 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు. శివుడు అష్టమూర్తి స్వరూపుడు. సూర్యుడు, చంద్రుడు, భూమి, నీరు, అగ్ని, వాయువు ఆకాశము, యజమానుడు శివుడి ప్రత్యక్షమూర్తులు. చంద్రుడు అమృతమూర్తి. వెన్నెల కురిపించి జీవకోటి మనస్సులకు ఆనందాన్ని కలిగించే షోడశకళాప్రపూర్ణుడు. శివభగవానుడు విభూతి సౌందర్యంతో ధవళతేజస్సుతో వెలుగొందుతూ తన కరుణ కిరణాలతో అమృత శీతలకాంతులను జీవులకు అనుగ్రహిస్తాడు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటి ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఇవో శ్రీ నాగ‌రాజు, సూపరింటెండెంట్‌ శ్రీ రాజ్‌కుమార్‌, అర్చకులు శ్రీ స్వామినాథ స్వామి, శ్రీ విజయస్వామి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టరు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఇత‌ర అధికారులు, విశేష సంఖ్య‌లో భ‌క్తులు  పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.