KAMAKSHI FESTIVAL IN SRI KT FROM OCTOBER 10 TO 19_ అక్టోబరు 10 నుండి 19వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

Tirupati, 29 Sep. 18: The Navarathri Utsavalu of Kamakshi Ammavaru in Sri Kapileswara Swamy temple will be observed between October 10 to 19.

Every day, the Goddess will appear in one guise as Durga, Annapurna, Saraswathi, and bless the devotees.

On last day, Paruveta Utsavam will be observed.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబరు 10 నుండి 19వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

తిరుపతి, 2018 సెప్టెంబరు 29: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అక్టోబరు 10 నుండి 19వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీకామాక్షి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయంలో విస్త తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ ఉత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 9న ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్టోబరు 11న శ్రీ కామాక్షి దేవి, అక్టోబరు 12న శ్రీ దుర్గాదేవి, అక్టోబరు 13న శ్రీ అన్నపూర్ణాదేవి, అక్టోబరు 14న శ్రీ ఆదిపరాశక్తి, అక్టోబరు 15న మావడి సేవ, అక్టోబరు 16న శ్రీ లక్ష్మీదేవి, అక్టోబరు 17న శ్రీ సరస్వతి దేవి, అక్టోబరు 18న మహిషాసురమర్థిని అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబరు 19న చివరిరోజు శ్రీ అభయహస్త ఆంజనేయస్వామివారి ఆలయ ప్రాంగణంలో పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, దేవి భాగవతంపై పురాణ ప్రవచనం, లలితసహస్రనామ పారాయణం కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.