ASTTOTHARASHATA KALASABHISHEKAM AT SRI KRT_ శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం

Tirupati, 2 March 2018: The sacred ritual of Astothara Shata Kalashabhisekam was grandly performed at Sri Kodandarama Swamy Temple on Friday morning in which the idols of Ammavari and Swami varu were given Abhisekam in 108 kalashams.

Later on in the evening the utsava idols of Sri Seetha, Lakshmana and Sri Kodandarama were paraded on the mada streets and taken to Sri Ramachandra Pushkarini where Asthanam and Pushkarini harati were performed to the deities.

Among others TTD local temples DyEO Smt Jhansi Rani, Temple Superintendent Smt Revati, Temple Inspector Sri Shesha Reddy and temple priests and other devotees particiapted.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీకోదండరామాలయంలో ఘనంగా అష్టోత్తర శతకలశాభిషేకం

తిరుపతి, 2018 మార్చి 02: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో శుక్రవారం అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఆలయంలోని ముఖమండపంలో ఉదయం 9.00 గంటలకు అమ్మవారు, స్వామివార్ల ఉత్సవమూర్తులకు 108 కలశాలతో అభిషేకం చేశారు.

ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీమతి రేవతి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి, ఆలయ అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.