NATIONAL VEDIC YUVACHATRA CONVENTION AT SV VEDIC UNIVERSITY FROM MARCH 3-6_ మార్చి 3 నుండి 6వ తేదీ వనరకు ఎస్‌.వి.” వేద విశ్వవిద్యాలయంలో ”జాతీయ వైదిక యువచ్ఛాత్ర సమ్మేళనము”

Tirupati, 2 March 2018: The SV Vedic University will host the National Vedic Yudchatra convention from tomorrow with the inaugural event in the Sri Mahavishnu yagashala in the morning.

As part of the event students will conduct contests in skills of Swadhyayanishnata, Shalaka, Brabasvarachana, Yogasanam, translations from Sanskrit to Telugu, Hindi and English Bhakti sangeet, short plays, Drawking, Classical instrumental music, Carroms and Bandminton sports as well.

SRINIVASA KALYANAM ON MARCH 3

Under the aegis of the HDPP,Srinivava Kalyanam project Srivai Srinivasa Kalyanam will be grandly performed at the Sri Mahavishnu yagashala of the S V Vedic University on March 3,tomorrow from 6.00 to 8.00 PM.

The Srinivasa Kalyanam is aimed to spread the glory of Lord Venkateswara in allregions and also facilitate devotees to witness the event without having to come all the way to Tirumala at expense and physical strain.

The artists of Annamcharya project will present bhakti sangeet and sankeertans on the ocassion.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చి 3 నుండి 6వ తేదీ వనరకు ఎస్‌.వి.” వేద విశ్వవిద్యాలయంలో ”జాతీయ వైదిక యువచ్ఛాత్ర సమ్మేళనము”

తిరుపతి, 2018 మార్చి 02: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయములో మార్చి 3 నుండి 6వ తేదీ వరకు జాతీయ వైదిక యువచ్ఛాత్ర సమ్మేళనము ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా 3వ తేదీ ఉదయం 10.30 గంటలకు విశ్వవిద్యాలయంలోని శ్రీ మహావిష్ణు యాగశాలలో అధికార ప్రముఖులతో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా విద్యార్థులకు స్వాధ్యాయనిష్ణాత, శలాక, ప్రబస్థరచన, యోగసనం, సంస్కృతం నుండి తెలుగు, హింది, ఆంగ్లభాషలోకి అనువాదం, భక్తిగీత పోటీలు, లఘునాటకమ్‌, చిత్రలేఖనం, శాస్త్రీయవాద్యవాదనం, క్యారమ్స్‌, బ్యాట్మింటన్‌ తదితర పోటీలు నిర్వహించనున్నారు.

మార్చి 3న శ్రీనివాస కల్యాణం

టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో మార్చి 3వ తేదీ శనివారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలోని శ్రీ మహావిష్ణు యాగశాలలో శ్రీవారి కల్యాణం వైభవంగా జరుగనుంది.

శ్రీవారి కల్యాణోత్సవం సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.