HANUMANTHA VAHANA SEVA IN SRI KRT _ శ్రీకోదండరామాలయంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ
Tirupati, 11 August 2018: Hanumantha Vahana Seva was observed in Sri Kodanda Rama Swamy temple in Tirupati on Saturday evening.
Earlier during the day, Sahasra Kalasabhishekam was performed.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీకోదండరామాలయంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ
తిరుపతి, 2018 ఆగష్టు 11: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శనివారం ఉదయం అమావాస్యను పురస్కరించుకుని సహస్రకలశాభిషేకం వైభవంగా జరిగింది.
ఆలయంలో ఉదయం 6.00 నుండి 8.00 గంటల నడుమ సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు హనుమంత వాహనసేవ వేడుకగా జరుగనుంది. సర్వాలంకార భూషితులైన శ్రీకోదండరామస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు చాలా విశిష్టత ఉంటుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీతిరుమలయ్య, సూపరింటెండెంట్ శ్రీ మునిక్రిష్ణారెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ శేషారెడ్డి, ఇతర అధికార ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.