PATTABHI RAMALAYA BRAHMOTSAVAMS IN VALMIKIPURAM _ ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు

Tirupati, 11 August 2018: The annual brahmotsavams of Sri Pattabhirama Swamy temple in Valmikipuram in Chittoor district will be observed from August 15 to 17.

This festival will commence with Ankurarpanam on August 15 by 6pm with Senadhipathi Utsavam.

On August 16 there will be Snapana Tirumanjanam between 10am and 11am and Sri Sita Rama Shanti Kalyanam in the evening between 7pm and 9pm followed by Hanumantha Vahana Seva between 9pm and 10pm.

On August 17, Garuda Vahana Seva will be observed in the evening from 7.30pm on wards.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు

తిరుపతి, 2018 ఆగస్టు 11: చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు ఆగస్టు 15వ నుండి 17వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీన సాయంత్రం 6.00 గంటలకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.

ఆగస్టు 16వ తేదీన ఉదయం 8.00 నుడి 10.00 గంటల వరకు యాగశాలపూజ, ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజలసేవ, రాత్రి 7.00 నుండి 9.00 గంటల వరకు శ్రీ సీతారాముల శాంతి కళ్యాణం జరగనుంది. రాత్రి 9.00 నుండి 10.00 గంటల వరకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.

ఆగస్టు 17వ తేదీన ఉదయం 7.00 నుండి 9.00 గంటల వరకు యాగశాల పూజ, స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 9.00 గంటల నుండి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకుఊంజలసేవ, రాత్రి 7.30 గంటల నుండి గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు.

గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదాన్ని బహుమానంగా అందజేస్తారు. మూడు రోజుల పాటు టిటిడి హిందూధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.