RADHASAPTHAMI IN SRI KRT ON FEB 12_ శ్రీకోదండరామాలయంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ

Tirupati, 4 February 2019: The temple of Sri Kodanda Rama Swamy in Tirupati is gearing up for the big occasion, Radhasapthami on February 12.

As a part of this event, lord will take pleasure ride on Suryaprabha Vahanam in the morning on that day at 8am and on Chandraprabha Vahanam in the evening at 7pm.

Meanwhile while Sahasra Kalasabhishekam and Hanumantha Vahanam observed in the temple on Monday.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీకోదండరామాలయంలో వైభవంగా సహస్ర కలశాభిషేకం, హనుమంత వాహనసేవ

తిరుపతి,2019 ఫిబ్రవరి 04: తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సోమవారం ఉదయం అమావాస్యను పురస్కరించుకుని సహస్రకలశాభిషేకం వైభవంగా జరిగింది.

ఆలయంలో ఉదయం 6.30 నుండి 9.30 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవర్లకు సహస్ర కలశాభిషేకంసేవ వైభవంగా నిర్వహించారు. రాత్రి 7.00 నుంచి 9.00 గంటల వరకు హనుమంత వాహనసేవ వేడుకగా జరుగనుంది. సర్వాలంకార భూషితులైన శ్రీకోదండరామస్వామివారు తనకు ఎంతో ప్రీతిపాత్రమైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వైఖానస ఆగమం ప్రకారం వైష్ణవాలయాల్లో పౌర్ణమి, అమావాస్య, శుక్ల ఏకాదశి, కృష్ణ ఏకాదశి, శ్రవణం, పునర్వసు నక్షత్రాలకు చాలా విశిష్టత ఉంటుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ శ్రీధర్‌, ఏఈవో శ్రీ తిరుమలయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 12న శ్రీ కోదండరామాలయంలో రథసప్తమి

ఫిబ్రవరి 12వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకొని రథసప్తమి పర్వదినాన తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సూర్యప్రభ వాహనం, చంద్రప్రభవాహనంపై శ్రీకోదండరామస్వామివారువారు ఊరేగనున్నారు.

ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 7.30 గంటలకు సూర్యప్రభవాహనం, రాత్రి 7.00 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను కటాక్షించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.