KRISHNASTAMI CELEBRATED IN TIRUMALA_ తిరుమలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

Tirumala, 23 Aug. 19: The annual festival Sri Krishnastami was celebrated with religious fervour in Tirumala on Friday.

Special Abhishekam was performed to the Kaliya Mardana Sri Krishna at Gogarbham Gardens in Tirumala under the aegis of Garden wing of TTD.

Deputy Director of Garden department Sri Srinivasulu performed the Abhishekam with milk, curd, honey, turmeric, and coconut water.

This was followed by Utlotsavam were in enthusiastic youth took part in this traditional mud pot breaking fete.

Spl.Gr.DyEO Smt Parvathi, KKC DyEO Smt Nagaratna and other officers were also present.

GOPUJA PERFORMED

The Gopujotsavam was performed with celestial fervour in Tirumala Gosala. The cattle were finely decked and rendered special puja on the occasioJanmashtamirishna Janmastami.

IN TIRUMALA TEMPLE

In view of Sri Krishna Janmashtami, Asthanam was performed in Tirumala temple on Friday night between 7.30pm and 9.30pm.

On Saturday Utlotsavam will be observed in Tirumala between 4 pm and 8 pm.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి

తిరుమల, 2019 ఆగ‌స్టు 23: తిరుమలలో శుక్ర‌వారంనాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

గోగర్భం డ్యామ్‌ చెంతగల ఉద్యానవనంలో కాళీయమర్ధనుడు అయిన శ్రీకృష్ణునికి ఉదయం పంచాభిషేకాలు చేశారు. అనంతరం అక్కడ ఉట్లోత్సం నిర్వహించారు. ఆ తరువాత ప్రసాద వితరణ జరిగింది. ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్‌ శ్రీ శ్రీనివాస్‌, ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి పార్వ‌తి, డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి నాగ‌ర‌త్న ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద రాత్రి 7.30 నుండి 9.30 గంటల నడుమ శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం ప్రబంధ శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానం ఘనంగా చేపడతారు.

కాగా, శ‌నివారం తిరుమలలో సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల మధ్య అత్యంత వైభవంగా ఉట్లోత్సవం నిర్వహిస్తారు. శ్రీ మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ ఈ ఉట్లోత్సవాన్ని తిలకిస్తారు. ఈ కార‌ణంగా ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.