GRAND SEETHARAMA KALYANAM AT SRI KRT_ శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

Tirupati, 26 February 2018: On part of the monthly tradition and the occasion of the Punarvasu nakshatram, the birth star of Sri Rama, Sri Sitarama Kalyanotsavam was grandly celebrated at the Sri Kodanda Ramaswamy Temple here today.

As part of the event amidst chanting of Vedic mantras and holy music, the Kalyanam was grandly conducted and the devotee couple who participated were presented Uttariyam, blouse piece, and anna prasadam. Later in the evening the utsava idols of Sri Rama along with Sri Seetha and Lakshman were paraded on the four mada streets and later taken to Sri Ramachandra Pushkarini for Unjal seva.

Among others, those who participated in the event were TTD local temples DyEO Smt Jhansi Rani, Supdt Sri Munikrishna Reddy, Temple inspector Sri Sesha Reddy, Temple priests and a large number of devotees.

SPECIAL EVENTS AT SRI KODANDARAMASWAMY TEMPLE IN THE MONTH OF MARCH 2018

March 3, 10,17,24 (Saturdays): Abhisekam of Sri Seetharama mula idols -Tiruchi procession of Swamy and Ammavaru on temple mada streets- unjal seva-Devotees can participate in Abhisekam @ Rs.20 tickets.

March 2, 2018: Astothara Shatakalashabisekam -Pournami -Rs.50 ticket for participation. Golden Tiruchi procession – Unjal seva and Asthanam at Sri Ramachandra Pushkarini.

March 13: Koil Alwar Thirumanjanam

March,16 & 24: Brahmosavam of Sri Kodandaramaswamy.

March 18: Ugadi Asthanam

March 25,26: Sri Rama Navami celebrations

March 28: Repakula Subbamma Thota Utsavam

March 29 and 31 : Teppotsavam

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI.

శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతి, 2018 ఫిబ్రవరి 26: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో సోమవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా కల్యాణం నిర్వహిస్తారు.

ఇందులోభాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవ ఘట్టం ప్రారంభమైంది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు.

అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీసీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడి నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ చేపడతారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శేషారెడ్డి, ఆలయ అర్చకులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

మార్చిలో శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చిలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– మార్చి 3, 10, 17, 24వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు.

-మార్చి 2వ తేదీ పౌర్ణమి సందర్భంగా ఉదయం 9.00 గంటలకు ఆలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం జరుగనుంది. భక్తులు రూ.50/- చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను బంగారు తిరుచ్చిలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి, శ్రీ రామచంద్ర పుష్కరిణిలో ఊంజలసేవ, ఆస్థానం నిర్వహిస్తారు.

– మార్చి 13న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది.

-మార్చి 16 నుండి 24వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.

-మార్చి 18వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు ఉగాది ఆస్థానం.

-మార్చి 25 నుండి 26వ తేదీ శ్రీరామ నవమి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి.

-మార్చి 28న రేపాకుల సుబ్బమ్మతోట ఉత్సవం నిర్వహించనున్నారు.

-మార్చి 29 నుండి 31వ తేదీ వరకు తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.