డిసెంబరులో శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

డిసెంబరులో శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2017, డిసెెంబరు 01: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో డిసెంబరులో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

– డిసెంబరు 2, 9, 16, 23, 30వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం, సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు, అనంతరం ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. భక్తులు రూ.20/- చెల్లించి మూలవర్ల అభిషేకంలో పాల్గొనవచ్చు.

– డిసెంబరు 6న పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11.00 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

– డిసెంబరు 18వ తేదీ అమావాస్యను పురస్కరించుకుని ఉదయం 6.30 గంటలకు ఆలయంలో సహస్ర కలశాభిషేకం జరుగనుంది. భక్తులు రూ.500/- చెల్లించి సహస్ర కలశాభిషేకంలో పాల్గొనవచ్చు. ఈ సందర్భంగా రాత్రి 7.00 గంటలకు శ్రీకోదండరామస్వామివారు హనుమంత వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు.

– డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

డిసెంబరు 3న అష్టోత్తర కలశాభిషేకం

శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో డిసెంబరు 3వ తేదీ ఆదివారం పౌర్ణమి సందర్భంగా అష్టోత్తర కలశాభిషేకం వైభవంగా జరుగనుంది.

ఆలయంలో ఉదయం 9.00 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.50/- చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు. అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో కృత్తిక దీపోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.