SRI KT BTU FROM FEBRUARY 25_ ఫిబ్రవరి 25 నుండి మార్చి 6వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 10 Feb. 19: The annual brahmotsavams in the famous TTD sub temple of Sri Kapileswara Swamy in Tirupati from February 25 to March 6.

The arrangements for the big fete are going in a fast pace in the temple. The important days includes Dhawajarohanam in Kumbha Lagnam on February 25, Nandi Vahanam on March 4 and Trisula Snanam on March 6.

The koil alwar tirumanjanam in connection with this fete takes place on February 23.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

ఫిబ్రవరి 25 నుండి మార్చి 6వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2019 ఫిబ్రవరి 09: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయ. ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

25-02-2019(సోమవారం) ధ్వజారోహణం(కుంభలగ్నం) హంస వాహనం

26-02-2019(మంగళవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం

27-02-2019(బుధవారం) భూత వాహనం సింహ వాహనం
28-02-2019(గురువారం) మకర వాహనం శేష వాహనం

01-03-2019(శుక్రవారం) తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం

02-03-2019(శనివారం) వ్యాఘ్ర వాహనం గజ వాహనం

03-03-2019(ఆదివారం) కల్పవృక్ష వాహనం అశ్వవాహనం

04-03-2019(సోమవారం) రథోత్సవం(భోగితేరు) నందివాహనం

05-03-2019(మంగళవారం) పురుషామృగవాహనం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం

06-03-2019(బుధవారం) శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,

సూర్యప్రభ వాహనం. ధ్వజావరోహణం.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 23న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 23వ తేదీ శనివారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా శనివారం ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. మధ్యాహ్నం 3.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.