SRI MALAYAPPA IN UTTI KRISHNUDU ALANKARAM ON SARVABHOOPALA VAHANAM _ సర్వభూపాల వాహ‌నంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ‌ మలయప్ప

Tirumala, 19 October 2020: On the evening of the Day-4 of the Srivari Navaratri Brahmotsvam, on Monday, Sri Malayappaswamy rode on Sarvabhupala vahan in Utti Krishnudu alankaram and blessed devotees.

The vahana is placed at the Kayanotsava mandapam of Srivari Mandapam in view of Covid-19 restrictions

Hindu mythology said Sarvabhoopala vahana displayed Sri Venkateswara as an almighty who totally controlled the Dikpalakas and elements of earth, water and air.

The objective is highlight the omnipotence and might of Sri Venkateshwara and control of the Dikpalas. Legends say that   Lord Malayappaa was overload of  – Indra (East), Agni (south-east), Yama (god of death on the South), Niruti (North – East), Varuna on (West), Vayu (south-west) and Kubera (god of wealth on North) and Parameswara on (North-west).

Tirumala Pontiffs Sri Sri Sri Pedda Jeeyar Swamy and Sri Sri Sri Chinna Jeeyar Swamy, TTD EO Dr KS Jawahar Reddy, Additional EO Sri AV Dharma Reddy, Board members Sri Ramesh Shetty, Smt Prashanti Reddy, Dr Nischitha, Sri Chippagiri Prasad, Sri Govind Hari, Sri DP Ananth, Sri Kumaruguru, Sri Dushyanthkumar Das, CVSO Sri Gopinath Jatti, Chief Engineer Sri Ramesh Reddy, Temple DyEO Sri Harindranath, Peishkar Sri Jaganmohan Charyulu and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

2020 శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు

సర్వభూపాల వాహ‌నంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ‌ మలయప్ప

తిరుమ‌ల‌, 2020 అక్టోబరు 19: శ్రీవారి న‌వ‌రాత్రి‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమ‌వారం రాత్రి 7.00 గంట‌ల‌కు శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై ఉట్టి కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు.

సర్వభూపాల వాహ‌నం – య‌శోప్రాప్తి

సర్వభూపాల అంటే అందరు రాజులు అని అర్థం. వీరిలో దిక్పాలకులు కూడా చేరతారు. తూర్పుదిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరృతి, పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్టదిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై, హృదయంలో ఉంచుకుని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనసేవ నుంచి గ్రహించవచ్చు.

కాగా బ్రహ్మోత్సవాలలో ఐదో రోజైన మంగ‌ళ‌వారం ఉదయం 9 గంటలకు మోహినీ అవతారం, రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై శ్రీవారు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఈవో డా. కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, డా. నిశ్చిత‌, శ్రీ చిప్ప‌గిరి ప్ర‌సాద్‌, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ డిపి.అనంత‌, శ్రీ కుమార‌గురు, శ్రీ ర‌మేష్‌‌ శెట్టి, శ్రీ దుస్మంత కుమార్ దాస్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, చీఫ్ ఇంజినీర్ శ్రీ ర‌మేష్‌రెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌ ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.