SRI MALAYAPPA SWAMY BLESSES DEVOTEES ON SWARNA RATHAM _ స్వర్ణరథంపై ఊరేగిన దేవదేవుడు
Tirumala, 29 September 2025: As part of the ongoing annual Brahmotsavams on Monday evening at 4 PM Sri Malayappa Swamy blessed devotees with His divine grace, majestically riding on the Swarna Ratham flanked by His two Consorts Sridevi and Bhudevi.
The procession along the four Mada streets was held in a grand manner amidst devotional dances, the chanting of bhajan groups, and the resonating sounds of traditional instruments.
A large number of women devotees enthusiastically participated in the pulling of the Swarna Ratham.
TTD EO Sri Anil Kumar Singhal, JEO Sri Veerabrahmam, CV&SO Sri Muralikrishna, CE Sri Satyanarayana, and other officials took part in this event.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
స్వర్ణరథంపై ఊరేగిన దేవదేవుడు
తిరుమల, 2025 సెప్టంబర్ 29: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సోమవారం సాయంత్రం 4 గంటలకు శ్రీవారు బంగారు తేరులో విహరిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. దాసభక్తుల నృత్యాలతోను, భజనబృందాల కోలాహలం, మంగళ వాయిద్యాల నడుమ తిరు మాడవీధులలో కడురమణీయంగా స్వర్ణరథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి స్వర్ణ రథాన్ని లాగారు.
స్వర్ణరథోత్సవాన్ని దర్శించడంవల్ల- లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలూ; భూదేవి కరుణతో, సమస్తధాన్యాలూ, శ్రీవారికరుణతో సర్వశుభాలూ, సుఖాలూ చేకూరుతాయని భక్తుల విశ్వాసం.
స్వర్ణ రథోత్సవంలో టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీ వీరబ్రహ్మం, సీవీఎస్వో శ్రీ మురళీకృష్ణ, శ్రీ సీఈ సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.













