SRI PAT PAVITROTSAVAMS FROM SEP 4_ సెప్టెంబరు 3న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలకు అంకురార్పణ
Tirupati, 2 September 2017: The three day annual pavitrotsavams in Tiruchanoor will be observed from September 4-6.
Ankurarpanam for the same will be performed on Sunday evening with Vishvaksena Aradhana and mritsangrahanam rituals.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
సెప్టెంబరు 3న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలకు అంకురార్పణ
సెప్టెంబరు 02, తిరుపతి, 2017:తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయ పవిత్రోత్సవాలకు సెప్టెంబరు 3వ తేదీ ఆదివారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరుగనుంది. సెప్టెంబరు 4 నుండి 6వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆదివారం సాయంత్రం 6 నుంచి 7.30 గంటల వరకు విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ, పవిత్ర అధివశం నిర్వహిస్తారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలు రద్దయ్యాయి.
ఆలయంలో సంవత్సరం పొడవునా పలు క్రతువుల్లో తెలిసీ తెలియక జరిగిన దోషాల నివారణకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి ఏడాదీ మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సెప్టెంబరు 4వ తేదీన పవిత్రప్రతిష్ఠ, సెప్టెంబరు 5న పవిత్ర సమర్పణ, సెప్టెంబరు 6న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగనున్నాయి. రూ.750/- చెల్లించి గ హస్తులు (ఒకరికి మూడు రోజులపాటు) ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తారు.
ఆర్జితసేవలు రద్దు :
సెప్టెంబరు 4వ తేదీ సోమవారం పవిత్రోత్సవాల్లో మొదటిరోజు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అష్టదళపాదపద్మారాధన, సెప్టెంబరు 5న రెండో రోజు మంగళవారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 6న పవిత్రోత్సవాల్లో చివరిరోజు బుధవారం కల్యాణోత్సవం, ఆష్టోత్తర శతకలశాభిషేకం, ఊంజల్‌సేవలను టిటిడి రద్దు చేసింది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.