SRIRAMA NAVAMI UTSAVAMS FROM MARCH 30-APRIL 1 _ మార్చి 30 నుండి ఏప్రిల్‌ 1వ తేదీ వరకుశ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు

TIRUPATI, 30 MARCH 2023: Sri Rama Navami utsavams will be observed in Sri Kodandarama temple at Tirupati from March 30-April 1.

On March 30 there will be Snapana Tirumanjanam to utsava murthies of Sri Sita Lakshmana Anjaneya sameta Sri Kodandarama between 8am and 9am.

On March 31, Sri Sita Rama Kalyanam will take place between 6pm and 8pm. The procession of Talambralu for the same will be held at TTD Administrative Building between 9am and 10am. The Grihastha devotees shall have to pay Rs.1000 per ticket on which two persons will be allowed to participate in the celestial event.

On April 1, Sri Rama Pattabhishekam will be observed between 7pm and 8:30pm.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 30 నుండి ఏప్రిల్‌ 1వ తేదీ వరకుశ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు

తిరుపతి, 2023 మార్చి 29: తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 30 వ తేదీ నుండి ఏప్రిల్‌ 1వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.

మార్చి 30న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం 8 నుండి 9 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనంపై శ్రీరాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

మార్చి 31న శ్రీ సీతారాముల కల్యాణం :

మార్చి 31వ తేదీన ఉదయం 9 నుండి 10 గంటల వరకు టీటీడీ పరిపాలనా భవనం నుండి ఏనుగు మీద ముత్యాల తలంబ్రాలను ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారామ కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.1000/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

ఏప్రిల్‌ 1న శ్రీరామ పట్టాభిషేకం :

ఏప్రిల్‌ 1న ఉదయం 8 గంటలకు తిరుపతిలోని శ్రీ నరసింహతీర్థం నుండి ఆలయ మర్యాదలతో తీర్థం తీసుకొచ్చి స్వామివారికి చతుర్దశ కలశ స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామ పట్టాభిషేకం చేపడతారు. ఆ తరువాత బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులను, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీ ఆంజనేయస్వామివారిని మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.