SRI RAMA NAVAMI FEST OBSERVED IN KRT_ శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

Tirupati, 25 March 2018: The festival of Sri Rama Navami was observed with religious fervour in the temple of Sri Kodanda Rama Swamy in Tirupati on Sunday.

Snapana Tirumanjanam was held to the utsava murthies of Sri Rama, Sita, Laxmana and Anjaneya.

Later in the evening unjal seva was performed followed by Hanumantha Vahana Seva.

SRI SITA RAMA KALYANAM ON MARCH 26

Sri Sita Rama Kalyanam will be observed in the temple on Monday between 6pm and 8pm. There will be procession of Mutyala Talambralu on Monday between 10:30am and 12 Noon. The devotees willing to take part in this divine wedding shall pay Rs.750 on which two persons will be allowed.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ కోదండరామాలయంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

తిరుపతి, 2018 మార్చి 25: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆదివారంనాడు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

కాగా, తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఉదయం 2.00 నుండి 3.00 గంటల వరకు మూలవర్ల అభిషేకం చేశారు. అనంతరం ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు ఊంజల్‌ మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు.

అనంతరం సాయంత్రం 3.00 నుండి 4.00 గంటల వరకు శ్రీరామ జనన ప్రవచనం, ఆస్థానం నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు ఊంజల్‌సేవ, అనంతరం ఉత్సవమూర్తులను వాహన మండపానికి వేంచేపు చేస్తారు. రాత్రి 8.00 నుండి 10.00 గంటల వరకు శ్రీరామచంద్రమూర్తి తన ప్రియభక్తుడైన హనుమంత వాహనాన్ని అధిష్టించి ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఝన్సీరాణి, సూపరింటెండెంట్‌ శ్రీమునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

మార్చి 26న శ్రీ సీతారాముల కల్యాణం :

తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా మార్చి 26వ తేదీ సోమవారం రాత్రి 6.00 నుండి 8.00 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరుగనుంది. ఇందుకోసం ఉదయం 10.30 నుంచి 12.00 గంటల వరకు ఏనుగు మీద ముత్యాల తలంబ్రాల ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఊరేగింపు టిటిడి పరిపాలన భవనం నుండి ప్రారంభమై తీర్థకట్ట వీధి, బజారు వీధి, గాంధీ రోడ్డు, నాలుగు మాడవీధుల గుండా ఆలయానికి చేరుకుంటుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

మార్చి 27న ఉదయం ఉత్సవమూర్తులకు తిరుమంజనం, సాయంత్రం 7.00 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు. మార్చి 28వ తేదీన ఖనిజం తోట ఉత్సవం జరుగనుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.