KAVI SAMMELANAM ENTHRALLS LITERARY LOVERS_ ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో ఆకట్టుకున్న కవిసమ్మేళనం
Vontimitta, 25 March 2018: The literary fete “Kavi Sammelanam” by renowned scholars of Telugu enthralled devotees who took part in it at Vontimitta on Sunday evening.
In connection with Pothana Jayanthi, Kavi sammelanam was organised. Sri A Subbirami Reddy, Sri Laxminarasimha Raju, Dr A Vibhishana Sharma, Smt Neelaveni, Smt Krishna Prabhavathi and many others rendered lectures on Potana, Bhagavatam, Bhaskara Ramayanam etc.
Sri Vidvan Katta Narasimhulu coordinated the fete.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో ఆకట్టుకున్న కవిసమ్మేళనం
మార్చి 25, ఒంటిమిట్ట, 2018: ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన ఆదివారం పోతన జయంతిని పురస్కరించుకుని టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సాయంత్రం నిర్వహించిన కవి సమ్మేళనం ఆకట్టుకుంది. ఇందులో కవులు ఒంటిమిట్ట కోదండరాముని వైభవాన్ని అద్భుతంగా వర్ణించారు.
ఇందులో శ్రీ అరవ సుబ్బరామిరెడ్డి పోతన వ్యక్తిత్వంపై, ఆర్.లక్ష్మి నరసింహ రాజు పోతన భక్తిత్వంపై వ్యాఖ్యానించారు. ఆ తరువాత శ్రీ ఆకెళ్ల విభీషణశర్మ రామాయణ కల్పవృక్షంపై, శ్రీ ఆముదాల మురళి నిర్వచనోత్తర రామాయణంపై, శ్రీ జాగర్లమూడి శ్యామసుందరశాస్త్రి
భాగవతంలోని సీతారామచరిత్రపై , శ్రీ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి శ్రీమదాంధ్రరామాయణకావ్యంపై, శ్రీమతి పెద్దిరెడ్డి నీలవేణి మొల్లరామాయణంపై, శ్రీ యలమర్తి మధుసూదన రఘునాయకాష్టంపై, శ్రీ కొండపల్లి వీరభద్రయ్య యక్షగాన రామాయణంపై, శ్రీమతి ఎం.కృష్ణప్రభావతి వాల్మీకి రామాయణంపై, శ్రీ యలమర్తి రమణయ్య ఉత్తర రామాయణంపై, శ్రీ ముమ్మడి నారాయణరెడ్డి
భాస్కర రామాయణంపై, శ్రీ మద్దెన రమేష్ వాసుదాసు రామాయణంపై చక్కటి పద్యాలను వినిపించారు.
ఈ కవి సమ్మేళనానికి విద్వాన్ కట్టా నరసింహులు సమన్వయకర్తగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ అనిమిరెడ్డి రామకృష్ణారెడ్డి, సనాతన ధార్మిక పరీక్షల ప్రత్యేకాధికారి ఆచార్య గార్లపాటి దామోదరనాయుడు పాల్గొన్నారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.