SRI RAMA PATTABHISHEKAM OBSERVED IN KRT_ శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

Tirupati, 27 Mar. 18: The coronation ceremony of Sri Rama was observed with religious fervour in the temple of Sri Kodanda Rama Swamy temple in Tirupati on Tuesday.

After the morning sevas, Snapana Tirumanjanam to Utsavarulu was performed between 9am and 11am.

Later in the evening Sri Rama Pattabhisheka Asthanam was performed between 7pm and 8:30pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వైభవంగా శ్రీరామపట్టాభిషేకం

మార్చి 27, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం రాత్రి శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం ఆలయ మర్యాదలతో నరసింహతీర్థం నుండి ఆలయానికి తీర్థాన్ని తీసుకొచ్చారు. ఉదయం 9 నుండి 11 గంటల వరకు యాగశాలలో అగ్నిప్రతిష్ఠ, చతుర్దశకలశస్నపన తిరుమంజనం నిర్వహించారు.

రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శ్రీరామపట్టాభిషేకం వైభవంగా జరుగనుంది. ఆ తరువాత రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీ సీతారామలక్ష్మణులు, ప్రత్యేక తిరుచ్చిపై శ్రీఆంజనేయస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఎవిఎస్‌వో శ్రీ గంగరాజు, ఆలయ సూపరింటెండెంట్‌ శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ శేషారెడ్డి, శ్రీ మురళీకృష్ణ పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.