SRI RAMAYANA HARIKATHA SAPTHAHA YAGNA CONCLUDES _ ఘనంగా ముగిసిన శ్రీ రామాయణ హరికథ సప్తాహ యజ్ఞం
BHAGAVATARINI SMT JAYANTI SAVITRI ALLURES AUDIENCE WITH HER HARIKATHA EXPERTISE
FELICITATED ON THE OCCASION
Tirupati, 30 March 2023: The week-long Sri Ramayana Harikatha Sapthaha Yagnam by renowned Harikatha Bhagavatharini Smt Jayanti Savitri concluded on a grand spiritual note on Thursday on the auspicious occasion of Sri Rama Navami at Annamacharya Kalamandiram in Tirupati under the aegis of Annamcharya Project of TTD.
Harikatha is a composite art form wherein a story is being narrated in a specific style with a composition of poetry, music, drama, dance, philosophy and is unique in Telugu literature. This art form is most prevalent in both the Telugu states of AP and TS.
Smt Jayanthi Savitri, after her three decades of impeccable three decades of career in TTD since 1992 as Harikatha Bhagavatharini is retiring from her service on March 31. She was often described as one among the versatile women Bhagavatharinis in Telugu states and made a remarkable place for herself in the field with her skills.
She won several laurels in her career and Harikatha Kathaka Raja Hamsa, Harikatha Sangeeta Bharati, Harikatha Ratna, Harikatha Choodamani are a few titles awarded for her expertise as Harikatha Bhagavatarini.
Smt Jayanti Savitri was later felicitated with Srivari Theertha Prasadams, Shawl by the employees of the Project on the occasion.
ఘనంగా ముగిసిన శ్రీ రామాయణ హరికథ సప్తాహ యజ్ఞం
– భక్తులను విశేషంగా కట్టుకున్న భాగవతారిణి శ్రీమతి జయంతి సావిత్రి హరికథా గానం
తిరుపతి, 2023 మార్చి 30: టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీరామ నవమి సందర్భంగా గురువారం నాడు ప్రముఖ హరికథా భాగవతారిణి శ్రీమతి జయంతి సావిత్రి గానం చేసిన శ్రీ రామ పట్టాభిషేకం ఘట్టంతో శ్రీ రామాయణ హరికథా సప్తాహ యజ్ఞం వైభవంగా ముగిసింది.
రామాయణంలోని అన్ని ఘట్టాలను శ్రీమతి జయంతి సావిత్రి ప్రేక్షకులను ఆకట్టుకునేలా గానం చేశారు. టీటీడీ లో 30సంవత్సరాలకు పైగా విధులు నిర్వహించిన శ్రీమతి సావిత్రి శుక్రవారం ఉద్యోగ విరమణ చేస్తున్నారు.
ఉద్యోగ విరమణ సందర్బంగా గురువారం సాయంత్రం అన్నమాచార్య కళామందిరంలో అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మతో పాటు పలువురు అధికారులు,ఉద్యోగులు శ్రీమతి జయంతి సావిత్రిని ఘనంగా సన్మానించారు. విధి నిర్వహణలో తనకు సహకరించి ప్రోత్సహించిన అధికారులు, సహ కళాకారులకు శ్రీమతి సావిత్రి కృతఙ్ఞతలు తెలిపారు.
ఈ సందర్బంగా డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన అతి కొద్దిమంది మహిళా భాగవతారిణిలలో శ్రీమతి సావిత్రి ఒకరన్నారు.
తన నైపుణ్యంతో ఈ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు.
ఆమె తన కెరీర్‌లో హరికథా కథక రాజ హంస, హరికథా సంగీత భారతి, హరికథా రత్న, హరికథ చూడామణి వంటి కొన్ని బిరుదులు అందుకున్నారని ఆయన అభినందించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.