SRI SEEETA RAMA KALYANAM AT SRI KRT ON AUG 27_ ఆగస్టు 27న తిరుప‌తిలోని శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం

Tirupati, 26 Aug. 19: TTD plans to conduct several holy events in the TTD local temples at Tirupati and Kadapa.

TTD plans to grandly conduct Sri Sitarama Kalyanam at Sri Kodandaramaswami temple on August 27 on the eve of Punarvasu star, the birth star of Sri Rama.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 27న తిరుప‌తిలోని శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతి, 2019 ఆగ‌స్టు 26: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో ఆగస్టు 27వ తేదీ మంగ‌ళ‌వారం శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రంను పుర‌స్క‌రించుకుని శ్రీ సీతారాముల కల్యాణం వైభ‌వంగా జరుగనుంది.

ఈ సందర్భంగా ఉదయం 11.00 గంటలకు శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.