PAVITHROTSAVAM AT KADAPA SRI LAKSHMI VENKATESWARA SWAMY TEMPLE FROM SEP 11-13_ సెప్టెంబరు 11 నుండి 13వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
Tirupati, 26 Aug. 19: TTD is geared to conduct Pavitrotsavam at Sri Lakshmi Venkateswara temple, Devuni Kadapa from September 11-13 and Ankurarpanam on September 10 evening.
As part of the event, the artists of TTDs Dasa Sahitya Project HDPP and Annamacharya Project will perform harikatha, Kolatas, bhajans, Bhakti sangeet Program.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరు 11 నుండి 13వ తేదీ వరకు దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుపతి, 2019 ఆగస్టు 26: టిటిడి పరిధిలోని వైఎస్‌ఆర్ జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సెప్టెంబరు 11 నుండి 13వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. సెప్టెంబరు 10న సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు విష్వక్సేనపూజ, అంకురార్పణంతో పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి.
సెప్టెంబరు 11వ తేదీ ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు చతుష్ఠార్చన, యాగశాలపూజ, పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు నిత్య హోమం నిర్వహిస్తారు. సెప్టెంబరు 12వ తేదీ ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ, సాయంత్రం 6.00 గంటలకు పవిత్ర హోమం నిర్వహించనున్నారు. సెప్టెంబరు 13న ఉదయం 6.00 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు స్నపనతిరుమంజనం, మహాపూర్ణాహుతి, పవిత్ర వితరణ తదితర కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవార్లవీధి ఉత్సవం నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భక్తి సంగీతం, హరికథ, దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.