SUBRAMANYA SWAMY HOMAM COMMENCES IN SRI KT_ కపిలతీర్థంలో ఘనంగా శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం

Tirupati, 24 October 2017: The two-day Subramanya Swamy homam commenced in Sri Kapileswara Swamy temple in Tirupati on Tuesday.

On Wednesday there will be Divya Kalyana Mahotsavam to Sri Subramanya Swamy with Valli and Devasena between 6pm and 8pm.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

కపిలతీర్థంలో ఘనంగా శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం

తిరుపతి, 2017 అక్టోబరు 24: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా మంగళవారం శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ఘనంగా ప్రారంభమైంది.

ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పూజ, హోమం, లఘుపూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు హోమం, సహస్రనామార్చన, విశేష దీపారాధన చేపట్టనున్నారు.

కాగా బుధవారం కూడా శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం జరుగనుంది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు.

గృహస్తులు (ఇద్దరు) రూ.250/- చెల్లించి టికెట్‌ కొనుగోలు చేసి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి అన్నప్రసాదాలు బహుమానంగా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, ఏఈవో శ్రీశంకర్‌రాజు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.