SRI VARI ANNUAL BRAHMOTSAVAM WALL POSTER RELEASED _ 2013 బ్రహ్మోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన తి.తి.దే ఛైర్మెన్, ఇ.ఓ
2013 బ్రహ్మోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన తి.తి.దే ఛైర్మెన్, ఇ.ఓ
తిరుమల, 12 సెప్టెంబరు 2013 : ఈ ఏడాది అక్టోబరు 5 నుండి 13 వరకు జరుగనున్న శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను గురువారంనాడు శ్రీవారి అలయం ముందు తి.తి.దే ఛైర్మెన్ శ్రీ కనుమూరు బాపిరాజు, ఇ.ఓ శ్రీ ఎం.జి.గోపాల్ అవిష్కరించారు.
ఈ సందర్భంగా ఛైర్మెన్ మీడియోతో మాట్లాడుతూ గత ఏడాది అన్ని విభాగాల సమన్వయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను అద్భుతంగా నిర్వహించడమైనదన్నారు. అదే రీతిలో ఈ ఏడాది కూడా శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తి.తి.దే భారీగా ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసి స్వామివారి వాహన వైభవాన్ని తిలకించి శ్రీవారి కృపను పొందాలని ఆకాంక్షించారు.
అనంతరం ఇ.ఓ శ్రీ ఎం.జి. గోపాల్ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తి.తి.దే సకల ఏర్పాట్లను చేస్తున్నదని తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు నూతన స్వర్ణరథ ం కూడా సిద్దమవుతున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ జి.వి.జి. అశోక్‌కుమార్, ఆలయ డిప్యూటి ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, ఆదనపు ఆర్థికశాఖాధికారి శ్రీ ఓ.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది