SRI VARI ANNUAL BRAHMOTSAVAM WALL POSTER RELEASED _ 2013 బ్రహ్మోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన తి.తి.దే ఛైర్మెన్‌, ఇ.ఓ

Tirumala, 12 Sep. 13: Sri K.Bapi Raju, Chairman TTDs and Sri M.G.Gopal, EO TTDs released ensuing Sri Vari Annual Brahmotsavam Wall Poster which begins from Oct 5 in  front of Sri Vari Temple, Tirumala on Thursday.
 
As a part of this mega religious fete, there will be Dwajarohanam on October 5, Garuda Vahanam on Oct 9, Golden Chariot on Oct 10, Rathotsavam on Oct 12 and Chakrasnanam on Oct 13.
 
Joint Executive Officer Sri K.S.Sreenivasa Raju, CVSO Sri GVG Ashok Kumar, FACAO Sri O.Balaji, Temple DyEO Sri Chinnamgari Ramana, Peishkar Sri R.Selvam, and others were present.
 
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

2013 బ్రహ్మోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన తి.తి.దే ఛైర్మెన్‌, ఇ.ఓ

తిరుమల, 12  సెప్టెంబరు 2013 : ఈ ఏడాది అక్టోబరు 5 నుండి 13 వరకు జరుగనున్న శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడపత్రికలను గురువారంనాడు శ్రీవారి అలయం ముందు తి.తి.దే ఛైర్మెన్‌ శ్రీ కనుమూరు బాపిరాజు, ఇ.ఓ శ్రీ ఎం.జి.గోపాల్‌ అవిష్కరించారు.

ఈ సందర్భంగా ఛైర్మెన్‌ మీడియోతో మాట్లాడుతూ గత ఏడాది అన్ని విభాగాల సమన్వయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను అద్భుతంగా నిర్వహించడమైనదన్నారు. అదే రీతిలో ఈ ఏడాది కూడా శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తి.తి.దే భారీగా ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేసి స్వామివారి  వాహన వైభవాన్ని తిలకించి శ్రీవారి కృపను పొందాలని ఆకాంక్షించారు.

అనంతరం ఇ.ఓ శ్రీ ఎం.జి. గోపాల్‌ మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తి.తి.దే సకల ఏర్పాట్లను చేస్తున్నదని తెలిపారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు నూతన స్వర్ణరథ ం కూడా సిద్దమవుతున్నదన్నారు.

ఈ కార్యక్రమంలో తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ముఖ్యనిఘా మరియు భద్రతాధికారి శ్రీ జి.వి.జి. అశోక్‌కుమార్‌, ఆలయ డిప్యూటి ఇ.ఓ శ్రీ చిన్నంగారి రమణ, ఆదనపు ఆర్థికశాఖాధికారి శ్రీ ఓ.బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది