SRIMANNAARAYABA ON GAJA VAHANAM _ గజ వాహనంపై శ్రీమన్నారాయణుడు కనువిందు
GLORIOUS VASANTHOTSAVAM HELD
Tirupati, 05 March 2024: As part of the ongoing annual Brahmotsavam of Sri Kalyana Venkateswara Swamy, on the evening of Tuesday, Srimannarayana blessed the devotees on Gajavahanam.
While the Gajarajas were walking in front of Vahanaseva, groups of devotees performed chekkabhajans and kolatams enhancing the grandeur of the Vahana Seva.
Special Grade Deputy EO of the temple Smt. Varalakshmi, AEO Sri. Gopinath, Advisor of Vaikhanasa Agama Sri Mohana Rangacharyulu, others participated.
Vasanthotsavam
As part of the Brahmotsavams of Srinivasa Mangapuram, Vasanthotsavam was held between 2pm and 3pm on Tuesday to the Utsava Murthies as a ritual of Relaxation providing them a soothing feel from hectic schedule of Vahana Sevas
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
గజ వాహనంపై శ్రీమన్నారాయణుడు కనువిందు
– వైభవంగా శ్రీ కల్యాణ శ్రీనివాసుడి వసంతోత్సవం
తిరుపతి, 2024 మార్చి 05: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరవ రోజు మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీమన్నారాయణుడు గజవాహనంపై భక్తులను అనుగ్రహించారు.
వాహనసేవ ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
వాహనసేవలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మి, ఏఈవో శ్రీ గోపినాథ్, వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ వెంకటస్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
వైభవంగా శ్రీ కల్యాణ శ్రీనివాసుడి వసంతోత్సవం
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది.
బ్రహ్మోత్సవాలలోస్వామి, అమ్మవార్లు ఉదయం, సాయంత్రం అలంకరణలు, వాహనసేవల్లో పాల్గొని అలసి వుంటారు కావున ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాలు నిర్వహిస్తారని అర్చకులు తెలిపారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శ్రీ భూ సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అర్చకులు, భక్తులు అహ్లాదకరంగా వసంతాలు ( గంథం కలిపిన నీళ్ళు) చల్లుకున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.