జనవరి 4న గుంటూరులో శ్రీనివాస కల్యాణం
జనవరి 4న గుంటూరులో శ్రీనివాస కల్యాణం
తిరుపతి, 2018 జనవరి 03: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జనవరి 4వ తేదీ గురువారం గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడు గ్రామంలో శ్రీవారి కల్యాణం వైభవంగా జరుగనుంది.
శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకరరావు ఈ కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.