ANDAL NEERATOTSAVAM FROM JAN 7-13_ శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 7 నుంచి 13వ తేదీ వరకు మార్గాళి నీరాటోత్సవం

Tirupati, 3 January 2018: The Andal Neeratotsavam is a week long fete observed to Goddess Sri Andal Godai in Sri Govindaraja Swamy temple.
In the auspicious dhanurmasam, the Goddess will taken on a procession every day morning at 5am to Ramachandra Gunta and special abhishekam is performed to her. Later in the evening she is returned to temple.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో జనవరి 7 నుంచి 13వ తేదీ వరకు మార్గాళి నీరాటోత్సవం

తిరుపతి, 2018 జనవరి 03: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాళ్‌ మార్గాళి నీరాటోత్సవం జనవరి 7 నుంచి 13వ తేదీ వరకు ఘనంగా జరుగనుంది.

ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 5.00 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీగోవిందరాజస్వామివారి ఆలయం నుండి శ్రీ రామచంద్ర కట్టకు ఊరేగింపుగా వెళతారు. అక్కడ వేడినీళ్లతో అభిషేకం చేస్తారు. ఆండాళ్‌ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిస్తారు. సాయంత్రం 5.00 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారు శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి చేరుకుంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.