జూన్ 24న గుంటూరు జిల్లాలో శ్రీనివాస కల్యాణం
జూన్ 24న గుంటూరు జిల్లాలో శ్రీనివాస కల్యాణం
తిరుపతి, 2018 జూన్ 22: కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూన్ 24వ తేదీన గుంటురు జిల్లాలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
జిల్లాలోని పెదకాకాని మండలం నంబురుగ్రామంలోని శ్రీ దశవతార వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.
సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి శ్రీవారి కల్యాణాలను చూడలేని భక్తులకోసం టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో టిటిడి శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.