జూన్ 25న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కొబ్బరి చిప్పల వేలం
జూన్ 25న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కొబ్బరి చిప్పల వేలం
తిరుపతి, 2018 జూన్ 22: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి భక్తులు సమర్పించిన కొబ్బరి చిప్పలకు జూన్ 25వ తేదీన టెండర్ కమ్ వేలం వేయనున్నారు.
అమ్మవారి ఆలయంలో 2018 – 19 సంవత్సరానికి సంబందించి కొబ్బరి చిప్పలను పొందుటకు ఆసక్తి గలవారు జూన్ 25వ తేదీ మధ్యాహ్నం 12.00 గంటలలోపు రూ.500/- చెల్లించి షెడ్యూల్ పొందవచ్చును. మధ్యాహ్నం 3.00 గంటలలోపు ఈ.ఎమ్.డి రూ.40,000/- డిడి జత చేసి టెండర్లు కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు వేలం నిర్వహిస్తారు.
ఇతర వివరాలకు తిరుచానూరులోని ప్రత్యేకశ్రేణి ఉప కార్యనిర్వహణాధికారివారి కార్యాలయాన్ని 0877 – 2264585 నంబర్లలో కార్యాలయం వేళల్లో సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.