SRINIVASA KALYANAM AT WG AND RAICHUR DISTRICTS_ డిసెంబరు 22 నుంచి 24వ తేదీ వరకు పశ్చిమగోదావరి, రాయచూర్‌లో శ్రీనివాసకల్యాణాలు

Tirupati, 20 December 2017: Under the auspices of the Srinivasa Kalyanam project, the TTD plans to organise unique and holy events of Srinivasa Kalyanams at West Godavari Dist on Dec 22 and at Raichur Dist in Karnataka on December 24.

In WG District the event is held at Pattampalem village of Tadepalligudem mandalmon December 22nd and at Madhavaram on December 23rd and at Antapadu on Dec 24.

Similarly Srinivasa Kalyanam will be performed at Annapurna VishalaksiI Vishveswar centerbof Gandhinagar In Raichur town.

It is well known that Srinivasa Kalyanam s are organised all over country and overseas to highlight the glory of Lord Venkateswara and also give an opportunity to common devotees to witness all rituals performed at Srivari temple daily.

The program is supervised by OSD Sri Prabhakar Rao and the artists of Annamacharya project will present cultural programs.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

డిసెంబరు 22 నుంచి 24వ తేదీ వరకు పశ్చిమగోదావరి, రాయచూర్‌లో శ్రీనివాసకల్యాణాలు

డిసెంబరు 20, తిరుపతి, 2017:టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 22 నుంచి 24వ తేదీ వరకు పశ్చిమగోదావరి జిల్లా, కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ కలిపి మొత్తం 4 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

డిసెంబరు 22న పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం పట్టెంపాళెంలో, డిసెంబరు 23న మాధవరంలో, డిసెంబరు 24న పెంటపాడు మండల కేంద్రంలో శ్రీవారి కల్యాణాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా, డిసెంబరు 24న కర్ణాటక రాష్ట్రం, రాయచూర్‌లోని గాంధీనగర్‌ గల అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర క్షేత్రంలో స్వామివారి exec కల్యాణం జరుగనుంది.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు చేస్తాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు. టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కె.ప్రభాకర్‌రావు ఈ కల్యాణాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.