SSD IS A TRUE PILGRIM – FRIENDLY DARSHAN SYSTEM-PILGRIMS_ సమయ నిర్దేశిత శ్రీవారి సర్వదర్శనంపై భక్తుల నుండి విశేష స్పందన

TIRUMALA, 20 December 2017: The Slot-wise Sarva Darshan(SSD) is gaining overwhelming response from pilgrim circles as it has successfully entered its third day on Wednesday as a part of its six day trail run by TTD.

OVER 98% VOTE FOR SSD

The feedback reports from pilgrims gathered by Srivari Seva volunteers are a standing example for the unanimous success of the new darshan system launched by TTD in a big way by setting up 117 counters in 14 different locations in Tirumala. About 98.78% pilgrims had voted positive for the new darshan system and thanked TTD mandarins for introducing Aadhaar based Slot-wise Sarva Darshan (SSD) to avoid long waiting hours in queue lines and compartments.

THANKS TO TTD FOR EARLY DARSHAN

According to a pilgrim Sri Selvan from Dharmapuri of Tamilnadu who came for darshan along with his friend said, he finished his darshan within couple of hours as promised by the TTD officials. “Every year I used to have darshan of Lord Venkateswara waiting in compartments for nearly 18-20 hours. But I am amazed to see that we are out just in two hours”, an excited Selvan said.

Adding further he said, “About 300 pilgrims from Dharmapuri and Hosur are coming in seven buses on December 23. We have informed everyone to carry Aadhaar along with them and have easy free darshan”, he added.

While Smt Mangamma from Bengaluru said, “We came to know about this darshan through SVBC scrolling. It’s a very nice idea. We request TTD to set up some counters in Tirupati also so that the pilgrims will have the facility to visit local temples”, she added.


ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

సమయ నిర్దేశిత శ్రీవారి సర్వదర్శనంపై భక్తుల నుండి విశేష స్పందన

డిసెంబరు 20, తిరుమల 2017: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే సామాన్య భక్తులకు మరింత సౌకర్యావంతంగా స్వామివారి దర్శనం కల్పించేందుకు టిటిడి నూతనంగా ప్రవేశ పెట్టిన సమయ నిర్దేశిత సర్వదర్శనంకు భక్తుల నుండి విశేష స్పందన లభించింది. ఇందులో భాగంగా మూడవ రోజైన బుధవారం కూడా ఈ దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో టోకెన్లు పొందారు. కాగా డిసెంబరు 18వ తేదీ నుండి తిరుమలలో 14 ప్రాంతాలలో 117 కౌంటర్ల ద్వారా టోకెన్లు ఆరు రోజుల పాటు ప్రయోగాత్మకంగా మంజూరు చేస్తున్న విషయం విదితమే.

సమయ నిర్దేశిత శ్రీవారి సర్వదర్శనంపై 98 శాతం మంది భక్తుల హర్షం

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా|| టి.రవి పర్యవేక్షణలో సహయ ప్రజాసంబంధాల అధికారి కుమారి పి.నీలిమ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు సర్వదర్శనం భక్తుల నుండి గత మూడు రోజులుగా అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఈ విధానంపై 98.78 శాతం మంది భక్తులు హర్షం వ్యక్తం చేశారు. భక్తులు నిర్ణిత సమయంలో స్వామివారి దర్శనం కల్పించినందుకు టిటిడికి కృతజ్ఞతలు తెలిపారు.

సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తుల మనోగతం :

సర్వదర్శనం టోకెన్లు పొందిన పలువురు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. తమిళనాడు ధర్మపురికి చెందిన శ్రీ సెల్వం మాట్లాడుతూ తన స్నేహితుడితో కలిసి సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లు పొంది రెండు గంటలలో స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో, కంపార్టుమెంట్లలో 18 నుండి 20 గంటలు వేచి ఉండి దర్శించుకున్నట్లు వివరించారు. కాని టిటిడి నూతనంగా ప్రవేశ పెట్టిన ఈ విధానం చాలా బాగుందని, దీనిని కొనసాగించాలని కోరారు. ఈ నూతన విధానాన్ని తాను ఇప్పటికే బంధుమిత్రులకు తెలియజేశామన్నారు. డిసెంబరు 23వ తేదీన ధర్మపురి, హోసురు నుండి ఏడు బస్సులలో దాదాపు 300 మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నట్లు తెలిపారు. వారికి ఆధారుకార్డు ద్వారా సులభంగా సర్వదర్శనం టోకెన్లు పొంది, త్వరగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చని వివరించినట్లు తెలిపారు.

బెంగుళూరుకు చెందిన శ్రీమతి మంగమ్మ మాట్లాడుతూ ఎస్వీబిసి చానళ్ల్‌లో స్క్రోలింగ్‌ చూసి సర్వదర్వనం టోకెన్ల విషయాన్ని తెలుసుకుని వచ్చామని చెప్పారు. సమయ నిర్దేశిత సర్వదర్శనం విధానం చాలా బాగుందన్నారు. టిటిడి ఇలాంటి కౌంటర్లను తిరుపతిలో ఏర్పాటు చేయడం వల్ల భక్తులు తిరుపతి పరిసర ప్రాంతాలలోని స్థానిక ఆలయాలను సందర్శించవచ్చని సూచించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.