SRINIVASA KALYANAM ENTHRALLS DENIZENS OF TALLAPAKA _ తాళ్లపాకలో వైభవంగా శ్రీవారి కల్యాణం

TALLAPAKA, MAY 24:  The denizens of Tallapaka were enthralled by the spiritual beauty of the wedding ceremony of the processional deities that took place in Dhyan Mandiram of the hamlet to mark the 605th Birth Anniversary of Saint Poet Tallapaka Annamacharya on Friday.
 
The celestial wedding which began by 10am with Punyahavachanam by the archakas of Tirumala in a grand way continued till12pm. The priests performed the Kalyanam of Lord Malayappa Swamy with his two Consorts Sridevi and Bhudevi in a colourful manner as per Hindu marriage tradition with Vishwaksena Aradhana, Ankurarpana, Raksha Bandhana, Agni Pratistha, New silk Vastrams, Maha Sankalpam, Kanyadanam, Mangalya Dharana, Varana Mayiram and concluded with Nakshatra Harati and Mangala Harati.
Tens of thousands of people converged in the sprawling grounds of the meditation hall to witness the grandeur of the celestial wedding and chanted Govinda Nama with overwhelming excitement.
 
Earlier during the day the artistes of Annamacharya Project performed Sapthagiri Sankeerthana Gosthi Ganam rendering the various kritis penned by the legendary saint poet as a tribute to the great soul. 
 
TTD has arranged Annaprasadam in the Dhyan Mandir grounds for the villages. TTD has also arranged two free buses to transport the people from Rajampet and nearby villages to Tallapaka for the celestial fete.
 
Meanwhile there will be special spiritual programmes and unjal seva at the 108-feet tall statue of Sri Tallapaka Annamacharya on Friday evening apart from Dhyan Mandir.
 
TTD outside temples AEO Sri Subramanyam and TTD Projects AEO Smt Padmavathi and others were also present.
—————————————-
తాళ్లపాకలో వైభవంగా శ్రీవారి కల్యాణం

తాళ్లపాక, మే 24, 2013: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 605వ జయంతిని పురస్కరించుకుని ఆయన జన్మస్థలమైన కడప జిల్లా తాళ్లపాకలోని ధ్యానమందిరం వద్ద తితిదే శుక్రవారం ఉదయం శ్రీవారి కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిపై 32 వేలకు పైగా సంకీర్తనలు రచించిన మొదటి వాగ్గేయకారుడు అన్నమయ్య జయంతి ఉత్సవాలు తాళ్లపాక, తిరుపతి, తిరుచానూరులో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
తాళ్లపాకలో ఉదయం 10.00 గంటలకు వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణవేదిక వద్దకు తీసుకొచ్చారు. ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు అర్చకుల వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. పుణ్యహవచనం, పవిత్రహోమం, కంకణధారణ, మాంగళ్యధారణ, మంగళాశాసనం ఘట్టాలతో సంప్రదాయబద్ధంగా శ్రీవారి కల్యాణం జరిగింది. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో కల్యాణం దిగ్విజయంగా ముగిసింది.
అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో ఉదయం 8.00 నుండి 9.00 గంటల వరకు నాదస్వర సమ్మేళనం, ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు సప్తగిరి సంకీర్తన గోష్టిగానం నిర్వహించారు. రాత్రి 7.30 నుండి 10.30 గంటల వరకు మదనపల్లికి చెందిన శ్రీ పి.నరసింహులు గాత్ర సంగీత సభ, అనంతపురానికి చెందిన శ్రీ డి.బాలబ్రహ్మం భాగవతార్‌తో హరికథ నిర్వహించనున్నారు. అన్నమయ్య జయంతి సందర్భంగా తితిదే భక్తులకు మంచినీరు, మజ్జిగ, ఉచిత ప్రసాదాలు అందించింది. పరిసర గ్రామాల ప్రజలు తాళ్లపాక రావడానికి ఉచిత బస్సులు ఏర్పాటుచేసింది. శ్రీవారి కల్యాణం అనంతరం ఏర్పాటుచేసిన అన్నప్రసాద వితరణలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
రాజంపేట-కడప హైవేలోని తాళ్లపాక వద్ద ఉన్న 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద సాయంత్రం 6.00 నుండి 7.00 గంటల వరకు శ్రీవారి ఊంజల్‌సేవ వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో సప్తగిరి సంకీర్తనా గోష్టిగానం, రాత్రి 7.45 నుండి 9.15 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఎ.పురుష్తోతంతో హరికథ కాలక్షేపం ఏర్పాటు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో తితిదే పరిసర ఆలయాల ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, ప్రాజెక్టుల ఏఈఓ శ్రీమతి పద్మావతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.