VENGAMAMBA IGNITED MANY LIVES WITH HER GREAT WORKS-VISAKHA SEER _ శ్రీవారి ఆంతరంగిక భక్త శిరోమణి వెంగమాంబ- ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 293వ జయంతి

TIRUMALA, 04 MAY 2023: Matrusri Tarigonda Vengamamba stoodbas an inspiration to many with her great literary works rendered on Srivaru, said HH Sri Swarupanandendra Saraswati Swamy of Visakha Sarada Peetham.

 

The Pontiff who graced the 293rd Jayanti fete of the saint poeteaa held at Narayanagiri Gardens in Tirumala on Thursday evening said, Vengamamba was the only devotee who was blessed by Sri Venkateswara Swamy to attain salvation at Tirumala and even today her Brindavanam is being visited by devotees to pay tributes.

 

“There may be many great saint persons, devotees who penned great devotional works but Vengamamba Sankeertans immerses devotees in spiritual waves. She was the one to get the credit after Sri Tallapaka Annamacharya “, he added.

 

He lauded EO Sri Dharma Reddy,  for observing the Jayanti fetes of great devotees who dedicated their lives in the divine service.

 

“Tarigonda Vengamamba Dana Sasanalu”, a book penned by reired lecturer and scholar Sri  Gopi Krishna was released on the occasion by the Pontiff of Visakha Sarada Peetham.

 

Earlier, the veteran and versatile artistes team from Annamacharya Project rendered Vengamamba kritis including Gana Nayaka, Balagopalam Bhaje, Vachenu Krishnufu Vagameeraga, Sri Madanagopala, Mangalam Nrisimha in a melodious manner in front of Sri Malayappa Swamy, Sridevi and Bhudevi who were seated on a swing in the finely decked Parinayotsava Mandapam.

 

After the programme, the deities returned to the temple.

 

The junior pontiff of Visakha Sarada Peetham Sri Swatmanadendra Saraswati Swamy, JEO for Health and Education Smt Sada Bhargavi, Annamacharya Project Director Sri Vibhishana Sharma, Temple DyEO Sri Lokanatham, VGO Sri Bali Reddy and other staff, devotees were also present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారి ఆంతరంగిక భక్త శిరోమణి వెంగమాంబ

– వెంగమాంబ రచనలు ఎందరికో స్ఫూర్తి : శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామిజీ

– ఘనంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 293వ జయంతి

తిరుమల 2023 మే 04: మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ శ్రీవారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు ప్రదర్శించి ఆంతరంగిక భక్త శిరోమణిగా గుర్తింపు పొందారని, తన కీర్తనలు ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచాయని విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామిజీ పేర్కొన్నారు. మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ 293వ జయంతి ఉత్సవాలు గురువారం తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామీజీ అనుగ్రహభాషణం చేస్తూ వెంగమాంబ తన సాహిత్యం, సంకీర్తనల ద్వారా అప్పట్లో సమాజంలో ఉన్న సమస్యలకు వ్యతిరేకంగా పోరాడి సంస్కరించారని తెలిపారు. సంసార ఆపేక్ష లేకుండా ఋషులు, మునులు ఏ విధంగా జీవించారో, అలా జీవించి శ్రీవారి అనుగ్రహాన్ని పొందినట్లు చెప్పారు.

తాళ్ళ‌పాక అన్న‌మాచార్యుల‌వారు త‌న సంకీర్త‌న‌ల‌తో శ్రీ‌వారిని ద‌ర్శించార‌ని, వెంగ‌మాంబ స‌జీవ స‌మాధి త‌రువాత కూడా స్వామి ఆల‌యానికి ద‌గ్గ‌ర‌గా ఉండి సేవిస్తున్నార‌న్నారు. వెంగమాంబ జయంతి ఉత్స‌వాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నందుకు టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డిని స్వామిజీ అభినందించారు.

అనంతరం శ్రీ సొరకాయల కృష్ణారెడ్డి రచించిన ” వెంగమాంబ దాన శాసనాలు ” గ్రంథాన్ని స్వామిజీ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

తరువాత టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి స్వామీజీని, ఉత్త‌రాధికారి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వాత్మానందేంద్ర స‌ర‌స్వ‌తి స్వామిజీని శ్రీ‌వారి ప్ర‌సాదంతో స‌త్క‌రించారు. అనంత‌రం స్వామిజీ జెఈవోని శాలువాతో స‌త్క‌రించారు.

ముందుగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు శ్రీవారి ఆలయం నుంచి ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనంలోని శ్రీ పద్మావతి వేంకటేశ్వర పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత నృత్య క‌ళాశాల అధ్యాప‌కులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు తరిగొండ వెంగమాంబ య‌క్ష‌గానం సంకీర్తనల గోష్టిగానం నిర్వహించారు. ఇందులో ” గణనాయక శరణు…., బాలగోపాలం భజే హే మనసా…., మంగళం నృసింహ….” తదితర సంకీర్తనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో అన్న‌మాచార్య ప్రాజెక్టుల సంచాల‌కులు డాక్టర్ విభీషణ శర్మ, శ్రీవారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, విజివో శ్రీ బాలిరెడ్డి, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఉమా ముద్దు బాల, ఇతర అధికారులు, విశేష సంఖ్య‌లో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.