SRINIVASA KALYANAMS AT 11 PLACES IN MARCH_మార్చిలో 11 ప్రాంతాల్లో శీనివాస కల్యాణాలు

Tirupati, 01 March 2018: As part of its mission to spread the glory of Lord Venkateswara and spread the message of spiritualism for a healthy lifestyle, the TTD has plans to organize Srinivasa Kalyanams at 11 locations in the month of March 2018.

The unique and celestial events will be conducted in Vizianagaram, Prakasam and Chittoor districts of Andhra Pradesh and Mulbagal in Karnataka.

In Vizianagaram district, it will be conducted in six locations ,

March 2 : SC Colony of Kanpgada valasa , Kurupam Mandal .
March 3: SC colony pf Raja charuvu valasa in Bobbili Mandal
March 4 : SC colony of Bedaripeta of Gurla Mandal.
March 5 :SC Colony of Devuni Kanapaka of gurla Mandal
March 6 : Mandal centre of Gantyada Mandal .

In Chittoor Dist ;

March 13: SC colony of Mudupaluta of Bangarupalem Mandal
March 15: SC colony of Diguva Kandriga in Chittoor (rural) Mandal
March 16; SC Colony of Chintalagunta village in Venudu Kuppam mandal
March 17 ;ZP school of Nettakuppam in R C Puram mandal

Prakasam Dist ;

March 31 : Police parade grounds of Ongole town

Kolar district of Karnataka ;

March 14 : N Vaddina halli of Mulbagal in Kolar Dist

It is the avowed objective of the TTD to conduct such Srinivasa Kalyanam events in remote areas to spread awareness on the glory of Sri Venkateswara and also facilitate the devotees from witnessing such celestial ritual without having to come all the way to Tirumala at great expense and physical strain.

On the occasion of the Srinivasa Kalyanams, the Annamcharya project artisans will perform bhakti sangeet and sankeertans to enthrall the bhakti culture among devotees.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చిలో 11 ప్రాంతాల్లో శీనివాస కల్యాణాలు

మార్చి 01, తిరుపతి, 2018 ; టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో విజయనగరం, ప్రకాశం, చిత్తూరు జిల్లాలతోపాటు కర్ణాటక రాష్ట్రం ముళబాగల్‌లో మొత్తం 11 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

విజయనగరం జిల్లాలో…

– మార్చి 2వ తేదీన కురుపం మండలంలోని కాస్పగడవలస ఎస్‌సి కాలనీలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– మార్చి 3న బొబ్బిలి మండలంలోని రాజాచెరువు వలస ఎస్‌సి కాలనీలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– మార్చి 4న గుర్ల మండలంలోని బెదరిపేట ఎస్‌సి కాలనీలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

– మార్చి 5న గుర్ల మండలంలోని దేవుని కసపాక ఎస్‌సి కాలనీలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– మార్చి 6న గంట్యాడ మండల కేంద్రంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

చిత్తూరు జిల్లాలో…

– మార్చి 13న బంగారుపాళెం మండలం మదుపోలుటు ఎస్‌సి కాలనీలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– మార్చి 15న చిత్తూరు రూరల్‌ మండలం దిగువ కండ్రిగ ఎస్‌సి కాలనీలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– మార్చి 16న వెదురుకుప్పం మండలం చింతలగుంట ఎస్‌సి కాలనీలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– మార్చి 17న ఆర్‌సిపురం మండలం నెత్తకుప్పం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు.

కర్ణాటకలోని ముళబాగల్‌లో..

– మార్చి 14న కోలార్‌ జిల్లా ముళబాగల్‌లోని ఎన్‌.వడ్డహళ్లిలో శ్రీవారి కల్యాణం జరుగనుంది.

ప్రకాశం జిల్లాలో…

– మార్చి 31న ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణాలు వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణాలు కనువిందు కానున్నాయి. శ్రీవారి కల్యాణోత్సవాల సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.