TTD EO PAYS SANDALWOOD TRIBUTES TO KANCHI PONTIFF AT KANCHI _శివలోక ప్రాప్తి చెందిన శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతిస్వామివారిని దర్శించుకున్న టిటిడి ఈవో

Tirupati ,01 March 2018 : TTD Executive Officer, Sri Anil Kumar Singhal visited Kanchi and paid floral tributes and sandal wood Parivattam to the last remains of the Sri Kanchi Kamakoti 69th Peethadhipati Sri Sri Sri Jayendra Saraswati on Thursday.

The current Kanchi Peethadhipati Sri Sri Sri Vijayendra Saraswati performed the tradtional Brindavan pravesham ritual to the remains of Sri Sri Sri Jayendra Saraswati for hours.

Among others the TTD temple OSD Sri Pala Sheshadri and Bokkasam Superintendent Sri Gururaja Rao and other temple officials participated in the event.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శివలోక ప్రాప్తి చెందిన శ్రీశ్రీశ్రీ జయేంద్రసరస్వతిస్వామివారిని దర్శించుకున్న టిటిడి ఈవో

మార్చి 01, తిరుపతి, 2018 శివలోక ప్రాప్తి పొందిన శ్రీ కంచి కామకోటి మఠం 69వ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారిని గురువారం టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ దర్శించుకున్నారు. టిటిడి ఈవో ఉదయం కంచికి చేరుకుని సంప్రదాయబద్ధంగా చందనపు కొయ్య, పరివట్టం సమర్పించారు.

శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతికి కంచి ఉత్తర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి అభిషేకం చేశారు. సుమారు 4 గంటల పాటు బృందావన ప్రవేశం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేకం అనంతరం శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతిస్వామివారిని బృందావనంలోకి ప్రవేశింపచేశారు. వేదమంత్రాల మధ్య బృందావన ప్రవేశ క్రతువు జరిగింది.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీవారి ఆలయ ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం సూపరింటెండెంట్‌ శ్రీ గురురాజారావు తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.