SRINIVASA KALYANAMS FROM JULY 26 TO 30_జూలై 26 నుంచి 30వ తేదీ వరకు ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు
Tirupati, 24 July 2017: The next phase of Srinivasa Kalyanams will be performed from July 26 to 30 in five different places in under the aegis of TTD Kalyanotsavam Project.
On July 26 in GD Nellore of Chittoor, on 27th at Putalapattu, on 28th in Narappa, July 29 at Dharmavaram and on July 30 in Madakasira of Anantapur district.
The Kalyanotsavam Project special officer Sri Prabhakar Rao is supervising the arrangements.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జూలై 26 నుంచి 30వ తేదీ వరకు ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు
తిరుపతి, 2017 జూలై 24: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో జూలై 26 నుంచి 30వ తేదీ వరకు ఐదు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.
– జూలై 26వ తేదీన చిత్తూరు జిల్లా జిడి.నెల్లూరు మండపం నెల్లేపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
– జూలై 27న చిత్తూరు జిల్లా పూతలపట్టులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.
– జూలై 28న అనంతపురం జిల్లా నార్పలలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
– జూలై 29న అనంతపురం జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.
– జూలై 30న అనంతపురం జిల్లా మడకసిరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.
శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి రాష్ట్రంలోనే గాక, దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ కె.ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.