SRINIVASA KALYANAMS FROM JUNE 23 TO 26 – ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో శ్రీనివాస కల్యాణాలు
Tirupati, 22 June 2017: The Srinivasa Kalyanams under the aegis of TTD’s Kalyanotsavam Project will be observed from June 23 to 26 in various places of AP and Karnataka.
On June in Singanamala of Anantapur and Galiveedu of Kadapa districts, on June 24 in Dharmavaram of Anantapur and B Kothakota of Chittoor districts, on June 25in Madakasira of Anantapur and Murlabagula of Karnataka and on June 26 in Rajaji Nagar of Bengaluru the celestial Kalyanams will be observed.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 23 నుండి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో శ్రీనివాస కల్యాణాలు
తిరుపతి, 2017 జూన్ 22: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలోజూన్ 23 నుండి 26వ తేదీ వరకు ఏడు ప్రాంతాలలో శ్రీవారి కల్యాణాలు వైభవంగా నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా జూన్ 23వ తేదీ అనంతపురం జిల్లా శింగనమల శాసనసభ నియోజకవర్గంలోని నార్పల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో, కడప జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో, శ్రీనివాస కల్యాణాలు వైభవంగా జరుగనున్నాయ. జూన్ 24వ తేదీ అనంతపురం జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో, చిత్తూరు జిల్లా బి.కొత్తకోట గ్రామంలోని పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో స్వామివారి కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు.
జూన్ 25వ తేదీ అనంతపురం జిల్లా మడకశిరలోని ప్రభత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో,
కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా ముళ్‌బాగళ్‌లోని శ్రీ ఓం శక్తి అమ్మవారి ఆలయంలో,జూన్ 26వ తేదీ బెంగుళూరులోని రాజాజి నగర్, రామ మందిరం మైదానంలో శ్రీనివాస కల్యాణం ఘనంగా నిర్వహించనున్నారు.
శ్రీవారి వైభవాన్ని నలుదిశల వ్యాప్తి చేయడంలో భాగంగా, సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చి శ్రీవారి కల్యాణాలను చూడలేని భక్తులకోసం టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో పలు ప్రాంతాలలో టిటిడి శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.