SRINIVASA KALYANAMS IN AUGUST_ ఆగ‌స్టులో క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు

Tirupati, 24 Jul. 19: The Srinivasa Kalyanams under the aegis Srinivasa Kalyanam Project of TTD in the month of August will be held at Kurnool and Anantapur districts.

In Kurnool, the Kalyanams will be observed at seven places in Kurnool at Orvakallu, Kalluru, Guduru, Veldurti, Atmakuru, Sanjamala and Avuju from August 2 to 8.

While in Anantapur at Pamidi, Vajrakaruru, Vidapanakal, Brahmasamudram, Kanekal, Rayadurgam, Dharmavaram from August 16 to 22.

Special Officer Sri Prabhakar Rao is supervising the arrangements.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టులో క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2019 జూలై 24: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆగ‌స్టు 2 నుండి 22వ తేదీ వ‌ర‌కు క‌ర్నూలు, అనంత‌పురం జిల్లాల్లోని 14 ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణాలు వైభవంగా నిర్వహించనున్నారు.

క‌ర్నూలు జిల్లా …

– ఆగ‌స్టు 2వ తేదీన ఓర్వ‌క‌ల్లు మండ‌ల కేంద్రంలోని శ్రీ జీవేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యంలో శ్రీ‌వారి కల్యాణం జరుగనుంది.

– ఆగ‌స్టు 3న క‌ల్లూరు మండ‌లం, జ‌హ‌ర‌పురంలోని ఎపిహెచ్‌బి కాల‌నీ పార్కులో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– ఆగ‌స్టు 4న గూడూరు మండ‌ల కేంద్రంలోని తిమ్మాగురుడు స్వామివారి ఆల‌యంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– ఆగ‌స్టు 5న వెల్దుర్తి మండ‌ల కేంద్రం, ఎస్‌.పేరిమాల‌లోని శ్రీ చెన్న‌కేశ‌వ‌స్వామివారి ఆల‌యంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– ఆగ‌స్టు 6న బండి ఆత్మ‌కూరు మండ‌ల కేంద్రంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– ఆగ‌స్టు 7న సంజామ‌ల మండ‌ల కేంద్రంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– ఆగ‌స్టు 8న అవుకు మండ‌ల కేంద్రంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

అనంత‌పురం జిల్లా …

– ఆగ‌స్టు 16న పామిడి మండ‌లం కాండ్ల‌ప‌ల్లిలో శ్రీ‌వారి కల్యాణం జరుగనుంది.

– ఆగ‌స్టు 17న వ‌జ్ర‌క‌రూరు మండ‌లం, జారుట్ల రామాపురం తాండాలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– ఆగ‌స్టు 18న విడ‌ప‌న‌క‌ల్ మండ‌లం, వి.కొత్త‌కోట‌లో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– ఆగ‌స్టు 19న బ్ర‌హ్మ‌స‌ముద్రం మండ‌లం, తీట‌క‌ల్లు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– ఆగ‌స్టు 20న క‌నేక‌ల్ మండ‌లం, బెనెక‌ల్‌లో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– ఆగ‌స్టు 21న రాయ‌దుర్గం మండ‌లం, గ్రామ‌ద‌ట్లలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– ఆగ‌స్టు 22న ధ‌ర్మ‌వ‌రం మండ‌లం, సుబ్బారావుపేట‌లో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.