PALLAVOTSAVAM OBSERVED IN TIRUMALA_ తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం

Tirumala, 24 Jul. 19: In view of the birth anniversary of the Mysore Maharaja I, Pallavotsavam was observed in Tirumala on Wednesday evening.

TTD has been observing Pallavotsavam since several decades in connection with the birth anniversary of the Maharaja I of Mysore Sansthan, who made huge contributions to the Hill Shrine of Lord Venkateswara.

After Sahasra Deepalankara Seva, the processional deities reached the gardens in Karnataka Chowltries where the Sri Malayappa Swamy was accorded religious reception by the representatives of the Karnataka government.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం

తిరుమల, 2019 జూలై 24: తిరుమలలో బుధవారంనాడు పల్లవోత్సవం ఘనంగా జరిగింది.

మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టిటిడి పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేసి మైసూర్‌ సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు.

అనంతరం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఓఎస్డి శ్రీ పాల శేషాద్రి, బొక్కసం ఇన్చార్జి శ్రీ గురురాజారావు, పార్ పత్తేదార్ శ్రీ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.