SRINIVASA KALYANAMS IN JULY IN AP AND TS_ జూలై 4 నుండి తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో శ్రీనివాస కల్యాణాలు

Tirupati, 28 Jun. 19: The celestial kalyanams of Sri Venkateswara Swamy with Srdevi and Bhudevi will be observed at 17 places in AP and TS from July 4 till 28.

On total 11places will be covered in Telengana and 6 in AP.

Srinivasa Kalyanam Project Special Officer Sri Prabhakara Rao is supervising the arrangements.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 4 నుండి తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలలో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2019 జూన్ 28: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల‌లో జూలై 4 నుండి 27వ తేదీ వరకు 17 ప్రాంతాలలో శ్రీవారి కల్యాణాలు వైభవంగా నిర్వహించనున్నారు.

తెలంగాణ రాష్ట్రం…

– జూలై 4వ తేదీన మంగ‌పేట మండ‌ల కేంద్రంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో శ్రీ‌వారి కల్యాణం జరుగనుంది.

– జూలై 5న భూపాల‌ప‌ల్లి మండ‌ల‌ కేంద్రంలోని సింగ‌రేణి క్రీడా మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– జూలై 6న రేగొండ మండ‌లం కొడ‌వ‌తంచ గ్రామంలోని శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ‌స్వామివారి ఆల‌య ప్రాంగ‌ణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– జూలై 7న ములుగు మండ‌ల కేంద్రంలోని స్థానిక శ్రీ‌రామాల‌యంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– జూలై 8న ప‌ర‌కాల మండ‌ల కేంద్రంలోని ప్ర‌భుత్వ డిగ్రీ క‌ళాశాల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– జూలై 10న జంగాన్‌ మండ‌ల కేంద్రంలోని పాత బీట్ బ‌జార్‌లో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– జూలై 11న స్టేష‌న్ ఘ‌న‌పూర్ మండ‌ల కేంద్రంలోని బాలిక‌ల ఉన్న‌త పాఠ‌శాల మైదానంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– జూలై 12న ఐన‌వోలు మండ‌ల కేంద్రంలోని శ్రీ మ‌ల్లీకార్జున స్వామివారి ఆల‌య ప్రాంగ‌ణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– జూలై 13న మ‌హ‌బూబాబాద్ మండ‌ల కేంద్రంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌ ప్రాంగ‌ణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు.

– జూలై 14న తొర్రూర్ మండ‌ల కేంద్రంలోని విజిటేబుల్ మార్కేట్ ప్రాంగ‌ణంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– జూలై 15న ఖిలా వ‌రంగ‌ల్ రూర‌ల్ మండ‌లంలోని వ‌రంగ‌ల్ కోట‌(ప‌డ‌మ‌ర‌)లో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రం…

– జూలై 23న వెల్దుర్తి మండ‌లం సిరిగిరిపాడు గ్రామంలోని శ్రీ రామాల‌యం ప్రాంగ‌ణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– జూలై 24న మాచ‌ర్ల మండ‌లం ఏకోనాంపేట గ్రామంలోని శ్రీ మ‌హ‌ల‌క్ష్మీ అమ్మ‌వారి ఆల‌య ప్రాంగ‌ణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– జూలై 25న రెంట‌చింత‌ల మండ‌లం తుమ్మురుకోట గ్రామంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల ప్రాంగ‌ణంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– జూలై 26న గుర‌జాల మండ‌లం గంగ‌వ‌రం గ్రామంలోని కొత్త అంబాపురంలోని మండ‌ల ప‌రిష‌త్ ఎలిమెంట‌రీ స్కూల్‌ ప్రాంగ‌ణంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– జూలై 27న పిడుగురాళ్ళ మండ‌లం జాన‌పాడు గ్రామంలోని శ్రీ రామాల‌యం ప్రాంగ‌ణంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– జూలై 28న వ‌ట్టిచెరుకూరు మండ‌లం ముట్లూరు గ్రామంలోని జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల ప్రాంగ‌ణంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించనున్నారు.

శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు టిటిడి పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తోంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణం వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణోత్సవాలు కనువిందు కానున్నాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.