TTD MAKES MINOR CHANGES IN ROOM BOOKINGS IN TIRUPATI_ జూలై 1 నుండి తిరుపతిలో టిటిడి వసతి గదుల బుకింగ్‌లో స్వల్పమార్పులు

Tirupati, 28 Jun. 19: The minor changes in the allotment of rooms at Vishnu Nivasam, Srinivasam, Madhavam Rest Houses will be effective from July 1.

As per new regulations, there will be only current booking at Vishnu Nivasam and devotees should vacate their rooms with in 24 hours.

However at Srinivasam and Madhavam rest houses, TTD has given online booking for 24 hr slot from 8am to next day 8am. If anyone arrives beyond the registered time, they should vacate within 24hours from the time they booked in on-line.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జూలై 1 నుండి తిరుపతిలో టిటిడి వసతి గదుల బుకింగ్‌లో స్వల్పమార్పులు

జూన్‌ 28, తిరుపతి, 2019: భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో గదుల బుకింగ్‌లో టిటిడి స్వల్పమార్పులు చేపట్టింది. జూలై 1వ తేదీ నుండి ఈ మార్పులు అమల్లోకి వస్తాయి.

ఈ మేరకు విష్ణునివాసం వసతి సముదాయంలో అన్ని గదులను కరంట్‌ బుకింగ్‌లో మాత్రమే కేటాయిస్తారు. ఇక్కడ భక్తులు గదులు పొందిన సమయం నుండి 24 గంటలలోపు ఖాళీ చేయాల్సి ఉంటుంది.

ఐతే శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లో అన్ని గదులను ఆన్‌లైన్‌లో భక్తులు బుక్‌ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక్కడ ఉదయం 8 నుండి మరుసటిరోజు ఉదయం 8 గంటల వరకు 24 గంటల స్లాట్‌ విధానం అమల్లో ఉంటుంది. బుక్‌ చేసుకున్న సమయం కంటే ఆలస్యంగా చేరుకున్నా నిర్దిష్ట సమయానికి ఖాళీ చేయాల్సి ఉంటుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.