SRINIVASA KALYANAMS IN TEN CENTRES FROM DECEMBER 2_ డిసెంబరు 2వ తేదీ నుండి పది ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణాలు

Tirupati, 27 November 2017: The Srinivasa Kalyanams will be observed at different 10 places in Nellore and West Godavari districts from December 2 to 13.

In Nellore district this celestial fete will be observed Chintalapalyam village on December 2, followed by Chettupalyam village on December 3, Tullukurupadu village on December 4, Pallipadu village on December 5, Vidavluru on December 6.

While in West Godavari, on December 9, the divine wedding of deities will be observed in T Narasapuram, December 10 in Kamavarapukota, December 11 in Chintalapudi, December 12 in Devarapalle ZP high school, December 13 in Gopalapuram ZP high school.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

డిసెంబరు 2వ తేదీ నుండి పది ప్రాంతాలలో శ్రీనివాస కల్యాణాలు

తిరుపతి, 2017 నవంబరు 27: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో డిసెంబరు 2 నుండి 13వ తేదీ వరకు నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో 10 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు జరుగనున్నాయి.

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో……

– డిసెంబరు 2వ తేదీన కలువాయి మండలం, చింతలపాళ్యం గ్రామంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీవారి కల్యాణం జరుగనుంది.

– డిసెంబరు 3న రాపూరు మండలం, చెట్టుపాళ్యం గ్రామంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

– డిసెంబరు 4న సంగం మండలం, తళ్ళుకురుపాడు గ్రామంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– డిసెంబరు 5న నెల్లూరు సమీపంలోని పల్లిపాడు గ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు.

– డిసెంబరు 6న విడవలూరు గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

పశ్చిమ గోదావరి జిల్లాలో ……

– డిసెంబరు 9న టి.నరసాపురం మండలం, నాయకులగూడెం గ్రామంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తారు.

– డిసెంబరు 10న కామవరపుకోటలో స్వామివారి కల్యాణం జరుగనుంది.

– డిసెంబరు 11న చింతలపూడిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు.

– డిసెంబరు 12వ తేదీన దేవరపల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో సాయంత్రం 6.00 గంటలకు శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– డిసెంబరు 13వ తేదీన గోపాలపురం మండలం, దొండపూడి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల మైదానంలో స్వామివారి కల్యాణం నిర్వహిస్తారు.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా రాఫ్ట్రంలోనే గాక దేశవిదేశాలలో శ్రీనివాస కళ్యాణాలు నిర్వహిస్తుంది. సుదూర ప్రాంతాల నుండి వ్యయప్రయాసలకోర్చి తిరుమలలో శ్రీవారి కల్యాణాలు వీక్షించలేని భక్తులకు ఈ కల్యాణాలు కనువిందు కానున్నాయి. శ్రీవారి కల్యాణోత్సవాల సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.