ELABORATE STEPS FOR VDAY AT SRINIVASA MANGAPURAM TEMPLE- JEO BHASKAR_ శ్రీనివాసమంగాపురంలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌

Srinivasa Mangapuram, 13 December 2018: Tirupati Joint Executive Officer Sri Pola Bhaskar said today that adequate arrangements were made for Vaikunta Ekadasi on December 18 and Vaikunta Dwadasi Darshana at the Sri Kalyana Venkateswara Swamy Temple in Srinivasa Mangapuram.

After inspection of the preparations at the temple on Thursday he said Vaikunta darshan is being organised at this temple from 2016 onwards and on both said days darshan of Lord Venkateswara through the Vaikunta Dwarka will be done. Necessary preparations are also done for Anna pradadam, drinking water, shamianas, queue lines, security, flower and electrical decorations and cultural programs.

Chief priest Sri Balaji Rangacharyulu said devotees can beget the punyam of performing fasting of 24 Ekadasis by darshan of Lord on Vaikunta Ekadasi, also known as Momshada Ekadasi. Similar moksha also is ordained of bathing in 64 holy Thirtham by bathing in the Pushkarani on these days, he says.

SE Sri Ramesh Reddy, Temple DyEO Sri Dhananjay, CMO Dr Nageswar Rao, VSO Sri Ashok Kumar Gowd, AEO Sri Lakshmibai, Supdt Sri Munichangalrayulu, Sri Ramanaiah, HDPP and other project officials participated.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీనివాసమంగాపురంలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌

తిరుప‌తి, 2018 డిసెంబరు 13: టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో డిసెంబరు 18న వైకుంఠ ఏకాదశి, 19న ద్వాద‌శి ప‌ర్వ‌దినాల‌కు విస్తృత ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ వెల్ల‌డించారు. ఆల‌యంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను గురువారం సాయంత్రం జెఈవో పరిశీలించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ 2016వ సంవ‌త్స‌రం నుండి ఇక్క‌డి ఆల‌యంలో వైకుంఠ ద్వారాన్ని ఏర్పాటుచేసి భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్న‌ట్టు తెలిపారు. డిసెంబరు 18, 19న వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి రోజుల్లో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. ఈ రెండు రోజుల్లో విచ్చేసే భ‌క్తుల‌కు అన్నప్ర‌సాదాలు, తాగునీరు పంపిణీ చేస్తామ‌న్నారు. చ‌లువ‌పందిళ్లు, క్యూలైన్లతోపాటు ఆక‌ట్టుకునేలా పుష్పాలంక‌ర‌ణ‌లు, విద్యుత్ దీపాలంక‌ర‌ణ‌లు, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తామ‌ని, ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని వివ‌రించారు. తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకోలేని భ‌క్తులు ఇక్క‌డి ఆల‌యంలో ద‌ర్శించుకోవ‌చ్చ‌ని కోరారు.

ఆల‌య ప్ర‌ధానార్చ‌కులు శ్రీ బాలాజి రంగాచార్యులు మాట్లాడుతూ వైకుంఠ ఏకాద‌శికి మోక్ష‌ద ఏకాద‌శి అనే పేరు కూడా ఉంద‌ని, 24 ఏకాద‌శులు పాటించ‌డం వ‌ల్ల క‌లిగే పుణ్యం వైకుంఠ ఏకాద‌శి, ద్వాద‌శి నాడు స్వామివారి ద‌ర్శ‌నం వ‌ల్ల క‌లుగుతుంద‌ని తెలిపారు. ద్వాద‌శినాడు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తామని, ఈ స‌మ‌యంలో పుష్క‌రిణిలో స్నానమాచ‌రిస్తే 64 తీర్థాల్లో స్నాన‌మాచ‌రించిన ఫ‌లితం క‌లుగుతుంద‌ని వివ‌రించారు.

జెఈవో వెంట టిటిడి ఎస్ఇ-1 శ్రీ ర‌మేష్ రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ధ‌నంజ‌య‌, సిఎంవో డా|| నాగేశ్వరరావు, విఎస్‌వో శ్రీ అశోక్‌కుమార్‌ గౌడ్‌, ఏఈవో శ్రీ ల‌క్ష్మ‌య్య‌, సూప‌రింటెండెంట్లు శ్రీ మునిచెంగ‌ల్రాయ‌లు, శ్రీ ర‌మ‌ణ‌య్య, హెచ్‌డిపిపి ఇత‌ర ప్రాజెక్టుల అధికారులు పాల్గొన్నారు.

——————————————————————

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.