KOIL ALWAR TIRUMANJANAM AT SRI KVT ON FEB 21_ ఫిబ్రవరి 21న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

Tirupati, 19 Feb. 19: The sacred ritual of Koil Alwar Thirumanjanam will be performed at the Sri Kalyana Venkateswara temple of Srinivasa Mangapuram on February 21.

As part of forthcoming annual Brahmotsavams of Sri Kalyana Venkateswara temple from February 24- March 4th it is a regular feature to perform the ritual of Koil Alwar Thirumanjanam.

TTD announced that the Tiruppavadai Sena has been cancelled as the temple will be closed from 6.00 to 11.00 am. After daily morning rituals of suprabatham, Tomala and Panchangam sravanam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఫిబ్రవరి 21న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి, 2019 ఫిబ్రవరి 19: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 21వ తేదీ గురువారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి4వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్న విషయం విదితమే. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగశ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 6.00 నుండి 10.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుంది. ఈ కారణంగా ఉదయం 6.00 నుండి 11.00 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం సందర్భంగా ఆలయంలో తిరుప్పావడ సేవ రద్దు చేశారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.