SRINIVASA MANGAPURAM GEARS UP FOR KARTHIKA VANABHOJANAM_ డిసెంబరు 4న శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక వనభోజనాలకు ఏర్పాట్లు పూర్తి

Tirupati, December 3, 2018 : TTD has made all arrangemets to conduct the holy event of Karthika Vana Bhojanam at Sri Kalyana Venkateswara Swamy temple at Srinivasa Mangapuram on December 4.

The Paruveta Mandalam is decked up with Shamianas, electrical and floral decorations besides queue lines etc for benefit of the devotees.

Special devotional and bhakti programs are also scheduled for the occasion.

As part of the event, the procession of Lord with His consorts Sridevi and Bhudevi will commence from temple at 8.00 AM and reach the Paruveta mandapam near Srivari mettu by 9.30 AM where Tirumanjanam will be performed for the utsava idols.

This will be followed by Asthanam from 10.00 AM onwrds. The devotees will be served delicious and tasty food as a part of vana bhojanam after the cultural programs.

The utsava dieties will return to temple between 2.00pm and 4.00 PM in a grand procession.

Senior TTD officials and devotees will participate in large number in this sacred annual event.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD,TIRUPATI

డిసెంబరు 4న శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక వనభోజనాలకు ఏర్పాట్లు పూర్తి

తిరుపతి, 2018 డిసెంబరు 03: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం కార్తీకవనభోజనాలకు టిటిడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందుకు అవసరమైన చల్లువ పందిళ్లు, విద్యుత్‌ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు చేసింది. అదేవిధంగా అధిక సంఖ్యలో విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు, స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా ఉదయం 8.00 నుండి 9.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లు ఊరేగింపుగా ఆలయం నుండి శ్రీవారి మెట్టు మార్గంలోని పార్యేట మండసానికి చేరుకుంటారు. ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు పార్వేట మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. ఆనంతరం ఆస్థానం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

అనంతరం టిటిడి ఏర్పాటు చేసిన వనభోజనంలో వివిధ రకాల రుచికరమైన వంటకాలను భక్తులకు వడ్డిస్తారు.

అనంతరం మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పార్వేట మండపం నుండి ఆలయానికి ఊరేగింపుగా చేరుకుంటారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు, భక్తులు పాల్గొంటారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.