SEA OF HUMANITY AT SRI KT_ కార్తీక మాసంలో శ్రీ కపిలేశ్వరాలయానికి పోటెత్తుతున్న భక్తులు

Tirupati, 3 December 2018: Huge turn out of devotees is being witnessed to the TTD sub Temple of Sri Kapileswara Swamy in the auspicious month of Karthika.

Especially, the Mondays which are often considered to be unique for Lord Shiva, that too in the month of Karthika, are being flooded by devotees.

Apart from all these special features, the temple authorities have also been observing month long Karthika Masa Visesha Mahotsavams which commenced on November 8 and will conclude on December 5.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

కార్తీక మాసంలో శ్రీ కపిలేశ్వరాలయానికి పోటెత్తుతున్న భక్తులు

తిరుపతి, 2018 డిసెంబరు 03: కార్తీక మాసంలో తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్తీక మాసం శివ కేశవులకులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో కపిలేశ్వర స్వామివారిని ఆవు పాలతో అభిషేకించి, జాజిపూలతో అర్చించినట్లయితే శివస్థానాన్ని పొందుతారని పురాణ ప్రశస్తి. సూర్యుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించే కార్తీక మాసంలో పుణ్యస్నానం, పుణ్యయోగుల దర్శనం, దైవదర్శనం చేసుకోవడం వల్ల రెట్టింపు ఫలితం కలుగుతుంది.

ఇలాంటి పవిత్రమైన కార్తీక మాసంలో తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ప్రతి సోమవారం విశేష సంఖ్యలో మహిళలు, యువతీ యువకులు దీపారాధన చేసి శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరస్వామివారిని దర్శించుకుంటున్నారు.

ఈ మాసంలో ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశేషపూజ మరియు హోమ మహోత్సవాలు చేపట్టారు. నవంబరు 8వ తేదీన గణపతి హోమంతో ఈ హోమ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు శ్రీసుబ్రమణ్యస్వామివారి హోమం, నవగ్రహ హోమం, శ్రీ దక్షిణామూర్తిస్వామివారి హోమం, శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం)నిర్వహించారు.

ప్రస్తుతం డిసెంబరు 5వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరస్వామివారి హోమం(రుద్రయాగం) జరుగుతోంది. ఇందులో పాల్గొన్న భక్తులకు విద్యాప్రాప్తి, వివాహం, ఉద్యోగం, సంతాన ప్రాప్తి కలుగుతాయని అర్చకులు వెల్లడించారు. గృహస్తులు రూ.500/- చెల్లించి ఒకరోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.

అనంతరం డిసెంబరు 6వ తేదీ శ్రీ కాలభైరవస్వామివారి హోమం, డిసెంబరు 7న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం జరుగనున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.